HYD: కంటైనర్‌లో ఇద్దరు సజీవదహనం
close

తాజా వార్తలు

Published : 06/05/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HYD: కంటైనర్‌లో ఇద్దరు సజీవదహనం

హైదరాబాద్‌: విద్యుదాఘాతం వల్ల చెలరేగిన మంటలతో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమైన ఘటన నగరంలోని ఉప్పల్‌లో ఈ ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన షహజాజ్(38) కంటైనర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన గంగా సాగర్(50) లోకల్ గైడ్‌గా ఉపాధి పొందుతున్నాడు. శంషాబాద్ నుంచి ఉప్పల్ ఐడీఏకు వీరిద్దరూ కార్ల కంటైనర్‌తో బయల్దేరారు. ఈ క్రమంలో మాడ్రన్ బెడ్ ప్రాంతానికి రాగానే ప్రమాదవశాత్తు వీరి వాహనం కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్తు తీగలు కంటైనర్‌పై పడి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. కంటైనర్‌లోని కార్లు సైతం పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరీశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని