సిద్దిపేటలో తొలి కరోనా కేసు
close

తాజా వార్తలు

Published : 01/04/2020 12:10 IST

సిద్దిపేటలో తొలి కరోనా కేసు

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. గజ్వేల్‌కు చెందిన 51ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్లు కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి బుధవారం తెలిపారు. బాధితుడు ఇటీవల దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మత పరమైన సమావేశాలకు హాజరై తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అతనికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉండటంతో రెండు రోజుల క్రితం సిద్దిపేట ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. అతని గొంతు నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో సదరు వ్యక్తిని హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు.

సిద్దిపేటకు చెందిన ఆరుగురు నిజాముద్దీన్‌లో జరిగిన సమావేశాలకు హాజరైనట్లు ప్రాథమిక సమాచారం. వారందరినీ గుర్తించి క్వారంటైన్‌లో ఉంచగా ఇద్దరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారి నమూనాలను పరీక్షించారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, మరొకరి ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో నిజాముద్దీన్‌లో జరిగిన సమావేశాలకు హాజరైన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశముండటంతో సర్వే చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని