తొలిదశ పల్లె పోరుకు ముగిసిన పోలింగ్‌
close

తాజా వార్తలు

Updated : 09/02/2021 19:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలిదశ పల్లె పోరుకు ముగిసిన పోలింగ్‌

అమరావతి: ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 12 జిల్లాల్లోని 2,723 పంచాయతీలు, 20,157 వార్డు స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో జరిగిన పోలింగ్‌.. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటువేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక చేపట్టనున్నారు. తొలి దశలో పోలింగ్‌లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తెలిపారు.

తొలిదశ ఎన్నికలపై ఎస్‌ఈసీ సంతృప్తి

రాష్ట్రంలో జరిగిన తొలిదశ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సంతృప్తి వ్యక్తం చేసింది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొంది. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు ఎస్‌ఈసీ అభినందనలు తెలిపింది.

 

ఇవీ చదవండి..
మా నాన్నకు ఓటేయండి: బుడతడి ప్రచారం వైరల్

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా: షర్మిల


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని