దాంపత్య జీవితానికి అడ్డు వస్తోందని...!
close

తాజా వార్తలు

Published : 14/02/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దాంపత్య జీవితానికి అడ్డు వస్తోందని...!

రెండో భార్యను హతమార్చిన మొదటి భార్య

మృతురాలు ఆరు నెలల గర్భిణి

రాయదుర్గం: తమ దాంపత్య జీవితానికి అడ్డువస్తోందని విసుగు చెందిన ఓ మహిళ (మొదటి భార్య) తన భర్త రెండో భార్యను చున్నీతో ఉరివేసి హతమార్చింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గం పోచమ్మబస్తీకి చెందిన కర్నె భాస్కర్‌ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు భార్యలు. భాస్కర్‌కు జానకితో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏడాది క్రితం స్రవంతి అనే మరో మహిళను భాస్కర్‌ రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి.

ఈ క్రమంలో గత కొంతకాలంగా జానకి, స్రవంతిల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా స్రవంతి  అడ్డు తొలగించుకోవాలని జానకి నిశ్చయించుకుంది. తన తమ్ముడు లక్ష్మీనారాయణకృష్ణ ప్రసాద్‌తో కలిసి స్రవంతిని హతమార్చేందుకు పథకం వేసింది. పథకంలో భాగంగానే 12వ తేదీన ఉదయం 10 గంటలకు స్రవంతికి జానకి ఫోన్ చేసింది. ఇద్దరి మధ్య ఉన్న గొడవలకు సంబంధించి మాట్లాడుకుందామని.. రాయదుర్గంలోని ఇంటికి వెంటనే రావాలని మాయమాటలు చెప్పింది. స్రవంతి రాయదుర్గం వచ్చేలోగా భర్త భాస్కర్‌కు టీలో నిద్ర మాత్రలు కలిపి పడుకోబెట్టింది జానకి. స్రవంతి ఇంటికి వచ్చాక మాటల్లో పెట్టి చున్నీతో ఉరివేసి చంపేశారు. వెంటనే మృతదేహాన్ని తన తమ్ముడు సాయంతో పక్కగదిలో దాచేశారు. 

సాయంత్రం నిద్రలేచిన భాస్కర్ పాతబస్తీలోని తన సోదరుడి ఇంటికి శుభకార్యానికి వెళ్లాడు. స్రవంతి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు భాస్కర్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు. తన వద్దకు రాలేదని భాస్కర్‌ వారికి చెప్పాడు. వెంటనే రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అదృశ్యం కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జానకి సోదరుడు కృష్ణప్రసాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్రవంతిని తామే చంపేసినట్లు వెల్లడించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు జానకి, కృష్ణప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

తల్లికి భయపడి... అత్యాచార నాటకం

ఏపీ పంచాయతీ: ముగిసిన రెండో దశ పోలింగ్‌

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని