ఏనుగు దాడిలో రైతు మృతి
close

తాజా వార్తలు

Updated : 13/11/2020 16:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏనుగు దాడిలో రైతు మృతి

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏనుగు దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయారు. కొమురాడ మండలం పరుశురాంపురానికి చెందిన లక్ష్మీనాయుడు అనే రైతు తెల్లవారుజామున పొలానికి వెళ్లాడు. అయితే అక్కడే ఉన్న ఓ ఏనుగు రైతుపై దాడిచేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీనాయుడు అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్లలో ఏనుగుల దాడిలో మృతి చెందినవారి సంఖ్య ఆరుకు చేరినట్లు వారు పేర్కొన్నారు. ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులను కోరుతున్నారు.
 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని