Corona: వేపాడలో కుటుంబం బలవన్మరణం
close

తాజా వార్తలు

Published : 15/05/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: వేపాడలో కుటుంబం బలవన్మరణం

వేపాడ: విజయనగరం జిల్లాలో కరోనా ఓ కుటుంబాన్ని కాటేసింది. కరోనా సోకిందనే బెంగతో వేపాడ మండలం నల్లబెల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులతో పాటు కుమారుడు, కోడలు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు చెప్పిన వివరాల మేరకు.. నల్లబెల్లి గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా(62), ఆయన భార్య సత్యవతి(57) విశాఖ జిల్లా చోడవరంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల చేయించుకున్న కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందనే భయంతో వీరిద్దరితో పాటు అయన తల్లి వెంకట సుబ్బమ్మ(84) ఆలయ సమీపంలో పురుగుల మందు తాగి.. బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు వల్లంపూడి ఎస్ఐ లోవరాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని