ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 25/03/2021 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య

కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రుణ భారమే వారి పాలిట యమపాశమైంది. అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో మల్కపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. రమేశ్‌, పద్మ దంపతులు ఓ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడగా.. కుమారుడు అక్షయ్‌(17), కుమార్తె సౌమ్య(19)మృతదేహాలు మరో చోట పడి ఉన్నాయి. ఇటీవలే కుమార్తె అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల 30 ఎకరాల్లో పంట వేసి తీవ్రంగా నష్టపోయానని .. ఏం చేయాలో తెలియక ప్రాణం తీసుకుంటున్నట్టు రమేశ్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ఘటనా స్థలంలో ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని