తెలంగాణలో మరో నాలుగు విప్లవాలు: కేటీఆర్‌
close

తాజా వార్తలు

Published : 19/06/2020 16:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో మరో నాలుగు విప్లవాలు: కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రంలో జల విప్లవం వచ్చిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దీనికి పునాదిగా మరో నాలుగు విప్లవాలు రానున్నాయని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాబోతున్న నూతన విధానాల గురించి వివరించారు. 

రైతులకు అన్ని విధాలుగా మేలు చేకూర్చేందుకు నియంత్రిత సాగు విధానం తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. రైతు బంధు సక్రమంగా అందేలా క్షేత్ర స్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతుబంధుపై తప్పుడు ప్రచారం చేసేవారికి దీటుగా సమాధానం ఇవ్వాలన్నారు. దేశానికి ఆదర్శంగా రైతు బంధును తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌.. దాన్ని ఎగ్గొట్టి రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తారా? అని విపక్షాలను ప్రశ్నించారు. వర్షాకాలం సాగుకు నీళ్లు, విత్తనాలతో పాటు అన్నీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని