ఆస్పత్రులకు ఉచితంగా ఆక్సిజన్: ఎంఈఐఎల్‌
close

తాజా వార్తలు

Published : 08/05/2021 19:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్పత్రులకు ఉచితంగా ఆక్సిజన్: ఎంఈఐఎల్‌

హైదరాబాద్‌: ఆస్పత్రులకు ఉచిత ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రెక్చర్‌ లిమిటెడ్‌( ఎంఈఐఎల్‌) ముందుకొచ్చింది. ఆక్సిజన్‌ అందించాలంటూ ప్రముఖ ఆస్పత్రుల నుంచి సంస్థకు అభ్యర్థలను వెల్లువెత్తడంతో ఎంఈఐఎల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆస్పత్రులు రోజుకు500 సిలిండర్లు కోరుతున్న నేపథ్యంలో డీఆర్‌డీవో తో కలిసి 40 ఆక్సిజన్‌ ఉత్సత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఒక్కో ప్లాంట్‌ నుంచి నిమిషానికి 150 నుంచి వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయవచ్చని సంస్థ చెబుతోంది. భద్రాచలం ఐటీసీ, స్పెయిన్‌ నుంచి క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ దిగుమతికి ఎంఈఐఎల్‌ అంగీకారం తెలిపింది. క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకుల తయారీకి కూడా  సంసిద్ధత వ్యక్తం చేసింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని