యువకుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి..
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 10:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యువకుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి..

మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నేలటూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై అతడి మిత్రులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. నేలటూరు గ్రామానికి చెందిన అంకమ్మ రావు, అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారంపై మిత్రులతో ఘర్షణ పడ్డారు. మద్యం మత్తులో స్నేహితుడిపై సహచరులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో అంకమ్మ రావు పరిగెత్తుకుంటూ గ్రామంలోకి వెళ్లగా స్థానికులు నీళ్లు పోసి మంటలను అదుపు చేశారు. అప్పటికే అతని శరీరం 80 శాతానికిపైగా కాలిపోవటంతో వెంటనే రిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని