Covishield 11కోట్లు..Covaxin 5కోట్లు
close

తాజా వార్తలు

Published : 04/05/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covishield 11కోట్లు..Covaxin 5కోట్లు

మే, జూన్‌, జులైలలో వ్యాక్సిన్‌ డోస్‌ల తయారీ

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు  కేంద్రప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మే, జూన్‌, జులై మాసాల్లో కరోనా వ్యాక్సిన్‌ తయారీకి అయ్యే ఖర్చుకు సంబంధించి తయారీ సంస్థలకు ముందస్తు చెల్లింపులను చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కొవిషీల్డ్‌ తయారీదారైన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.1,732 కోట్లను ఏప్రిల్‌ 28 విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ మూడు నెలల్లో 11 కోట్ల కొవిషీల్డ్‌ డోస్‌లను సీరమ్‌ తయారు చేయనుంది. గతంలో 10 కోట్ల డోస్‌లను అందించాలని కోరగా, మే 3వ తేదీ నాటికి 8.744 కోట్ల డోస్‌లను సీరమ్‌ సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త ఆర్డర్‌ ఇవ్వలేదని మీడియాలో వస్తున్న కథనాలను ఆరోగ్య మంత్రిత్వశాఖ ఖండించింది.

అదే విధంగా భారత్‌ బయోటెక్‌ అందిస్తున్న కొవాగ్జిన్‌ కోసం రూ.787కోట్లను విడుదల చేసినట్లు తెలిపింది. మే, జూన్‌, జులై మాసాలకు సంబంధించి మొత్తం 5కోట్ల కొవాగ్జిన్‌ డోస్‌లను భారత్‌ బయోటెక్‌ సరఫరా చేయనుంది. గతంలో భారత్‌ బయోటెక్‌కు 2 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు కావాలని ఆర్డర్‌ ఇవ్వగా మే 3వ తేదీ నాటికి 0.8813 కోట్ల డోస్‌లను మాత్రమే అందినట్లు తెలిపింది. వ్యాక్సిన్‌నేషన్‌ ప్రక్రియ మొదలు పెట్టిన నాటి నుంచి మే 2వ తేదీ వరకూ కేంద్రం 16.54 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేసింది. ప్రస్తుతం ఇంకా 78లక్షల డోస్‌లు రాష్ట్రాల వద్ద ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. వచ్చే మూడు రోజుల్లో మరో 56లక్షల డోస్‌లను రాష్ట్రాలకు అందించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని