సంపూర్ణ లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం: రాహుల్‌ గాంధీ
close

తాజా వార్తలు

Published : 05/05/2021 02:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంపూర్ణ లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం: రాహుల్‌ గాంధీ

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్రం చేపట్టిన చర్యలేవీ కరోనాను నియంత్రించలేకపోయాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. ఇక మహమ్మారి కట్టడి ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం లాక్‌డౌన్‌ ఒక్కటేనని అభిప్రాయపడ్డారు. 

‘‘కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే సంపూర్ణ లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం. ప్రభావిత వర్గాలకు రక్షణ కల్పిస్తూ లాక్‌డౌన్ అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ చేతగానితనం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ప్రభుత్వానికి అర్థం కావడం లేదా? ప్రభుత్వం వద్ద కరోనా కట్టడికి ఎలాంటి వ్యూహం లేనందున ఇక లాక్‌డౌన్ అనే ప్రత్యామ్నాయం ఒక్కటే మిగిలింది. నిజానికి వైరస్ వ్యాప్తి కట్టడి చేయలేని స్థాయికి చేరుకోవడానికి ఒక రకంగా వారే దోహదం చేశారు. దీంతో భారత్‌పై ఓ పెద్ద నేరమే జరిగిపోయింది’’ అని ప్రభుత్వంపై రాహుల్‌ మండిపడ్డారు.

రాహుల్ వ్యాఖ్యలపై భాజపా తీవ్ర స్థాయిలో మండిపడింది. మహమ్మారి పేరుతో ‘నీచ రాజకీయాలు’ చేస్తున్నారని పార్టీ ఐటీ ఇన్‌ఛార్జి విమర్శించారు. ఈ విషయం రాహుల్‌కు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తాజా వ్యాఖ్యలు రాహుల్‌ దిగజారుడుతననానికి నిదర్శనమని దుయ్యబట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని