వైకాపా నేత ఇంట్లో భారీగా మద్యం పట్టివేత
close

తాజా వార్తలు

Published : 08/04/2020 01:30 IST

వైకాపా నేత ఇంట్లో భారీగా మద్యం పట్టివేత

ఒంగోలు: లాక్‌డౌన్‌ అమలులో ఉన్న వేళ... ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటలో వైకాపా నేత ఇంట్లో భారీగా మద్యం నిల్వలు బయటపడ్డాయి. పలుచోట్ల భారీగా మద్యం నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, సీఐ తిరుపతయ్య నేతృత్వంలో సిబ్బంది గడికోటలో సోదాలు నిర్వహించారు. 

ఈ క్రమంలో వైకాపా నేత శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో 1200 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కారును సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల గడికోట ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న అధికారులు మద్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్నదానిపై ఆరా తీస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి కర్ణాటక నుంచి మద్యం తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్టు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని