ప్రైవేటీకరణను జీర్ణించుకోలేకపోతున్నాం: గంటా
close

తాజా వార్తలు

Updated : 13/03/2021 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రైవేటీకరణను జీర్ణించుకోలేకపోతున్నాం: గంటా

తిరుపతి: లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను కేంద్ర ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. శనివారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జీర్ణించుకోలేకపోతున్నామని, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. రాజీనామాను కొందరు రాజకీయం చేయడం సరికాదన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఉద్యమించి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు బాధ్యతను సీఎం జగన్‌ తీసుకోవాలని, సీఎం చొరవ తీసుకుంటే కలిసి నడుస్తానని చంద్రబాబు స్పష్టం చేశారని గుర్తు చేశారు. చివరి అస్త్రం రాజీనామాలు సంధించే సమయం ఆసన్నమైందన్నారు. ఉక్కు ఉద్యమంలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటే ప్రభావం ఎక్కువగా ఉంటుందని గంటా శ్రీనివాసరావు అన్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని