గిల్‌ విఫలం.. అదే కారణం: సన్నీ
close

తాజా వార్తలు

Published : 05/03/2021 09:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గిల్‌ విఫలం.. అదే కారణం: సన్నీ

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ విఫలమవ్వడంతో నిరాశకు గురయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అర్థ శతకాలతో అదరగొట్టిన అతడు ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఒక్క అర్ధశతకం మినహా చెప్పుకోదగిన స్కోర్‌ చేయలేకపోయాడు. అయితే, గిల్‌ ఇప్పుడు రాణించలేకపోవడానికి ఒక కారణముందని టీమ్‌ఇండియా మాజీ సారథి, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత గిల్‌పై భారీ అంచనాలు ఉన్నాయని సన్నీ వివరించాడు. ఈ క్రమంలోనే యువ బ్యాట్స్‌మన్‌ ఒత్తిడికి గురవుతుండొచ్చని చెప్పాడు. అలాగే గిల్ బ్యాటింగ్‌లో మార్పులు చేసుకోవాలని మాజీ సారథి సూచించాడు. మరోవైపు ఇంగ్లిష్‌ జట్టు నాలుగో టెస్టులోనూ ప్రభావం చూపలేకపోయిందని, ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ పట్టుదల ప్రదర్శించలేకపోయారని సన్నీ పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 250-260 స్కోర్‌ సాధించి ఉంటే బాగుండేదని ఓ జాతీయ మీడియాతో చెప్పుకొచ్చాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని