close

తాజా వార్తలు

బ్రేక్‌ వేసినా రైలు వెంటనే ఆగదేం?

ప్రశ్న: రైలుకు బ్రేకులు వేస్తే వెంటనే ఆగదు. ఎందువల్ల?

- జి.వైష్ణవి,ఎమ్‌.టి.సి.స్కూల్‌, హైదరాబాద్‌

రైలు చాలా వేగంగా ప్రయాణించేటప్పుడు దానికి చాలా ఎక్కువ ద్రవ్యవేగం అంటే మొమెంటమ్‌ ఉంటుంది. రైలు ఆగాలంటే ఈ ద్రవ్యవేగం సున్నా కావాలి. ఎక్కువ ద్రవ్యవేగంతో వెళ్లే రైలును ఆపాలంటే చాలా ఎక్కువబలం బ్రేకులతో ప్రయోగించాలి. ఇలా ప్రయోగించడం వల్ల బ్రేకులకు, చక్రాలకు మధ్య విపరీతమైన ఘర్షణ ఏర్పడుతుంది.
* అంతేకాదు రైలు పట్టాలకు, చక్రాలకు మధ్య కూడా ఈ ఘర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో చక్రాలు, రైలు పట్టాలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు రైలు పట్టాలు తప్పే అవకాశం ఉంటుంది.
*స్కూటర్లు, మోటారు సైకిళ్లకు ఉండే డిస్కు బ్రేకులు వాటిని క్షణాల్లో ఆపుతాయి.అలా రైలు విషయంలో సాధ్యంకాదు.
* 24 కోచ్‌లున్న రైలు ఆగాలంటే దాదాపు 1300 నుంచి 1500 మీటర్ల దూరం నుంచి మెల్లిమెల్లిగా బ్రేకులు వేస్తూ చివరకు ఆపగలుగుతారు. 15 కోచ్‌లున్న రైలు విషయంలో ఈ దూరం తగ్గుతుంది. కిలోమీటరు దూరంలో ఆగాల్సి వచ్చినప్పుడు బ్రేకులు వేస్తారు.
* రైలు వేగం గంటకు 110 కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్లకు తగ్గేటట్లు చేసి బ్రేకులు వదులు చేస్తారు. దీని వల్ల బ్రేకులు వేసినప్పుడు ఏర్పడిన వేడి చల్లారుతుంది. పైగా చక్రాలు, రైలు పట్టాల అరుగుదల చాలా తక్కువ. ఆ తర్వాత మళ్లీ బ్రేకులు వేయడం వల్ల రైలు వేగం గంటకు 30 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. ఆ తర్వాత 15 కిలోమీటర్లకు తగ్గిస్తారు. చివరకు రైలు ఆగుతుంది.
- డాక్టర్‌ సి.వి. సర్వేశ్వర శర్మ,  ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌, అమలాపురం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.