close

తాజా వార్తలు

Published : 13/01/2020 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అర్థమవుతోందా..?

దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సందర్భంలో వినిపించే మాటే ఇది. కాకపోతే స్వరమే మారుతుంది. ఒక్కోసారి భర్త తనను ఏమాత్రం అర్థం చేసుకోవడంలేదని భార్య అనుకుంటే, భార్య తనను అసలు పట్టించుకోవడమే మానేసిందని భర్త వాపోతుంటాడు. అర్థం చేసుకోవడం లేదని బాధపడే ముందు భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మీకెంత అవగాహన ఉందో ఒకసారి గమనించండి.
* మీ భాగస్వామి గురించి సూటిగా, సుత్తిలేకుండా మూడే మూడు ముక్కల్లో చెప్పమంటే ఏం చెబుతారు?
* మీరు మొదటిసారిగా కలిసిన సందర్భం, ప్రదేశం గుర్తున్నాయా? ఆ అనుభూతిని తలచుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది?
*భాగస్వామి నుంచి మొదటిసారిగా అందుకున్న ఉత్తరమో, మెసేజ్‌నో ఇప్పటికీ పదిలపరచుకున్నారా?
* పండగ లేదా ప్రత్యేక సందర్భాల్లో భాగస్వామికి ఎలాంటి కానుకలు ఇస్తారు?
* పెళ్లయిన తర్వాత మీరిద్దరూ కలిసి చూసిన మొదటి సినిమా గుర్తుందా?
* మీ భాగస్వామి అభిరుచులేమిటి? తనకు బాగా నచ్చే రంగు ఏది?
* తన అభిమాన నటి లేదా నటుడెవరు. తనకు బాగా నచ్చిన రచయిత ఎవరు? నచ్చిన పుస్తకం ఏది?
* పుట్టినరోజు సందర్భంగా మీరు వేసుకున్న డ్రెస్‌ను చూసి సహోద్యోగులు మెచ్చుకున్నారు. వాళ్లకంటే ముందు మీ భాగస్వామి దాని గురించి ఏమన్నారో గుర్తుందా?
* బాస్‌ కోప్పడ్డాడని విచారంగా ఇంటికొచ్చిన భాగస్వామికి ఎలాంటి సాంత్వన అందించారు?
* అనుకోకుండా ఒకరోజు మీ భాగస్వామి స్నేహితులు ఇంటికి వచ్చారు. అప్పుడు మీ స్పందన ఎలా ఉంది?
* మీ భాగస్వామి ఈమధ్య మిమ్మల్ని ఏ సందర్భంలో మెచ్చుకున్నారు.
* తనకు ఒంట్లో బాగోక బాగా ఇబ్బందిపడిన సందర్భంలో మీరు కాస్త సాయం అందించారా? ఎలాంటి సాయం చేశారు.
* కాస్త దిగులుగా ఉన్న భాగస్వామిని చూసి చిరాకుపడతారా? కారణం అడిగి తెలుసుకుని పరిష్కార మార్గం చెబుతారా?

పై ప్రశ్నలకు నిజాయతీగా సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించండి.  మీ పాత్రనూ నిశితంగా పరిశీలించుకోండి. ఎక్కువ ప్రశ్నలకు సమాధానం సానుకూలంగా ఉంటే మీరు భాగస్వామిని అర్థం చేసుకోవడంలో ముందున్నారని అర్థం. తెలియదు, లేదు, గుర్తేలేదు... లాంటి సమాధానాలు వచ్చాయనుకోండి... భాగస్వామి గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉందని అర్థం.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని