
తాజా వార్తలు
ఆ వీడియో షేర్ చేస్తానంటున్నాడు!
ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఒక స్నేహితుడితో వాట్సాప్ వీడియో చాట్ చేశాను. అతనంటే నాకు ఇష్టం ఉండటం వల్ల, కొంచెం సన్నిహితంగానే వీడియోలో ప్రవర్తించాను. ఇటీవల మా మధ్య కొద్ది పాటి మనస్పర్థలు రావడంతో, అతడు ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. చాలా భయంగా ఉంది. ఇది ఇంట్లో తెలిస్తే నాకు ఆత్మహత్య తప్ప మరో గతి లేదు. సలహా ఇవ్వగలరు?
- ఓ సోదరి
ముందు ముఖ్యంగా మీరు చేయవలసిన పని ధైర్యంగా ఉండటం. ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో అయినా ఆత్మహత్య పరిష్కారం కాదు. మీరు భయపడుతున్నారని తెలిస్తే ఆ వ్యక్తికి బలం వస్తుంది. మనస్పర్థలు రాగానే ఇటీవల వ్యక్తులు అవలంబిస్తున్న దారుణమైన పద్ధతి వీడియోలు, చాటింగ్స్ అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం. సాధారణంగా ఇలా బెదిరించే వారికి ఇబ్బందుల గురించి అవగాహన ఉంటుంది. అందువల్ల అవతలి వారిని మానసికంగా వేధించడానికి వీటితో బెదిరింపులకు దిగుతారు. ఇవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించడం... అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం వల్ల చాలా సులభం. నకిలీ ఐడీలతో చేసినా వారిని పట్టుకోవడం సాధ్యమే. అటువంటి నేరాలకు కఠిన శిక్షలు తథ్యం. ఈ సంగతి బెదిరించే వారికి తెలుసు అందువల్ల చాలా వరకూ ఈ బెదిరింపులు వాస్తవ రూపం దాల్చవు. ఒకవేళ ఆ వ్యక్తి నిజంగానే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడని మీకు అనుమానంగా ఉంటే, పోలీసులకు భయపడకుండా ఫిర్యాదు చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచి, అతడి మీద చర్యలు తీసుకుంటారు. మీరు భయపడాల్సిన పని లేదు. ఇకపైన, ఎంత దగ్గరి స్నేహితులైనా సరే, వీడియో చాట్లకు దూరంగా ఉండండి. ఎవరు ఏ క్షణంలో ఎలా మారతారో చెప్పలేం. మగవారితోనే కాదు, సాటి ఆడపిల్లలతో అయినా సరే, వీడియో చాట్లకు దూరంగా ఉండటం మంచిది. వాటిని వేరే వారికి షేర్ చేయడం చాలా సులభం. వాటి దుష్ప్రభావాలు ఎదుర్కోవడం మాత్రం కష్టమైన పని.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
