close

తాజా వార్తలు

Updated : 28/01/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒకబడి  ఒకవిద్యార్థిని

పాఠశాలలో సమయానికి గంట మోగుతుంది. తరగతి గదిలో ఉపాధ్యాయురాలు పాఠాలు మొదలెడుతుంది. ‘అల్లరి చేయొద్దు, నిశ్శబ్దంగా ఉండండి’ అని చెప్పే శ్రమ మాత్రం ఆమెకుండదు. ఎందుకంటే... ఆమె పాఠాలు వినేది ఒకే ఒక అమ్మాయి. ఆ తరగతి గదిలోనే కాదు, ఆ పాఠశాలకు ఆ ఒక్క అమ్మాయి మాత్రమే విద్యార్థిని. బిహార్‌లోని గయ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల అది. ఇద్దరు ఉపాధ్యాయులు విధుల్లో ఉండగా, ఈ ఏడాది తొమ్మిదిమంది విద్యార్థులు ఇందులో చేరారు. వీరిలో జాహ్నవి కుమారి మాత్రమే తరగతులకు హాజరవుతోంది. ప్రస్తుతం ఈ చిన్నారి ఒకటో తరగతి చదువుతుండగా, రోజుకి ఏడు గంటలపాటు టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు. అంతేకాదు, మధ్యాహ్న భోజనాన్ని తయారుచేసి మరీ ఆ చిన్నారికి అందిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించాలనే ఆసక్తి తల్లిదండ్రులకు ఉండటమే ఈ పరిస్థితికి కారణమైంది. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా చదువుకోవాలనే శ్రద్ధతో వస్తున్న జాహ్నవిని ఉత్తమ విద్యార్థినిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారా ఉపాధ్యాయులు.

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని