close

తాజా వార్తలు

Published : 28/01/2020 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పరీక్షలంటే భయపడుతున్నాడు!

మా బాబు వయసు పద్నాలుగేళ్లు. పదోతరగతి చదువుతున్నాడు. చాలా తెలివైనవాడు. బాగా చదువుతాడు. తనకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. నెల రోజుల నుంచి సరిగ్గా చదవడం లేదు. భయంగా ఉంటున్నాడు. నిద్రపోవట్లేదు. లేచి కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు. ‘చదవడం నాకిష్టం లేదు. చదవడం నాకు చేత కాదు. నేను చదవను, బడి మానేస్తా’ అని అంటున్నాడు. ఇప్పటిదాకా తను క్లాసులో మొదటి అయిదారు ర్యాంకుల్లో ఉండేవాడు. ఇప్పుడే ఇలా తయారయ్యాడు. పరీక్షలేమో దగ్గరపడుతున్నాయి. వీడిని మార్చేదెలా?

- ఓ సోదరి

మీ బాబు ఎగ్జామ్‌ ఫోబియాతో బాధపడుతున్నాడు. పరీక్షలో ఫెయిలవుతానేమోనని భయపడుతున్నాడు. మీరు ఇన్నాళ్లూ బాబుపై పెద్దగా ఒత్తిడి పెట్టలేదు. సహజంగానే పబ్లిక్‌ పరీక్షలనగానే తల్లిదండ్రులు, టీచర్లు, పిల్లలపై ఒత్తిడి తెస్తుంటారు. స్కూల్లో టీచర్లు కూడా అలా చేస్తున్నారేమో కనుక్కోండి. మార్కులు తక్కువ వస్తాయని తనకు తానే అనుకుంటున్నాడంటే ఎవరో అతడితో వాటి గురించి ప్రతికూలంగా చర్చించి ఉండొచ్ఛు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే తనకు వెన్నులో వణుకు, గుండె దడ లాంటివి వస్తుండొచ్ఛు దాంతో బడికి వెళ్లాలంటే భయపడుతున్నాడు. మీరూ తనను బలవంతంగా స్కూలుకు పంపుతుంటే తనలో ఆందోళన మరింత పెరిగిపోతుంది. ఆ టెన్షన్‌లో చదివింది తనకు గుర్తుండటం లేదు. అయోమయంగా ఉండి ఏంచేయాలో తెలియడం లేదు. దాంతో చదువే మానేయాలనుకుంటున్నాడు.

మీరేం చేయాలంటే.. పిల్లాడికి పరీక్షలంటే భయపడాల్సిన అవసరం లేదని చెప్పండి. తను తెలివైన విద్యార్థి అని పదే పదే గుర్తు చేయండి. ఇంతకు ముందు తను సాధించిన విజయాలు గుర్తు చేయండి. ముందుగా తనని సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకువెళ్లండి. వారు అవసరమైతే శ్వాస వ్యాయామాలు చెబుతారు. కౌన్సెలింగ్‌ ద్వారా తనలో నెలకొన్న భయాన్ని తొలగిస్తారు. దీంతోపాటు కుటుంబ సహకారం కూడా చాలా అవసరం. తను చదువుకుంటున్నప్పుడు మీరు తన పక్కనే కూర్చోండి. తనకు వచ్చే సందేహాలకు సమాధానాలు చెప్పండి. సులువుగా ఎలా చదవాలో సూచించండి. మధ్యలో స్వల్ప విరామాలివ్వండి. చిన్న చిన్న పరీక్షలు పెట్టండి. వాటిల్లో చక్కటి మార్కులు వస్తే అభినందించండి. మెచ్చుకోండి. తనకు మరీ ఆందోళన ఎక్కువైతే.. దాన్ని తగ్గించడానికి వైద్యులు మాత్రలు సూచిస్తారు. కాబట్టి మీరు ఓసారి బాబును మానసిక నిపుణుడి దగ్గరకు తీసుకువెళ్లండి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని