close

తాజా వార్తలు

Published : 07/02/2020 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గోడలు మెరిసేలా...

ఎంతో ఖర్చుచేసి గోడలకు రంగులు వేయిస్తాం. వాటిని సరిగ్గా శుభ్రం చేయకుంటే... దుమ్మూధూళి చేరి ఇంటికి కొత్తదనం పోతుంది. మరి గోడలెప్పుడూ కొత్తగా ఉండాలంటే ఇవి చేసి చూడండి.


డ్రై డస్ట్‌ మాప్‌


గోడలపై పేరుకుపోయిన దుమ్మును, మరకలను తొలగించాలంటే డ్రై డస్ట్‌ మాప్‌ ఉత్తమం. ఈ విధానంతో అన్ని గోడలు తుడవొచ్చు.


మైక్రో ఫైబర్‌ క్లాత్‌


ఎంత ప్రయత్నించినా స్విచ్‌బోర్డులు, గోడ మూలలను సరిగ్గా శుభ్రం చేయలేం. అలాంటప్పుడు మైక్రో ఫైబర్‌ గుడ్డను ఎంచుకోవాలి.


మైల్డ్‌ డిష్‌వాషింగ్‌ లిక్విడ్‌

కొన్ని కొన్ని మరకలు అస్సలు వదలవు. అలాంటప్పుడు స్పాంజ్‌ను మైల్డ్‌ డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌లో ముంచి... గోడలను తుడవాలి. నూనె మరకలు సైతం వదిలిపోతాయి.


మ్యాజిక్‌ ఎరేజర్‌

పాత గోడలు కొత్తగా మెరవాలన్నా, జిడ్డు మరకలు వదలాలన్నా మ్యాజిక్‌ ఎరేజర్‌ను ఎంచుకోవాలి. ఇది మ్యాజిక్‌ చేసినట్టుగా గోడలను మెరిపిస్తుంది.


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని