close

తాజా వార్తలు

Published : 07/02/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెత్తా చెత్తా హుష్‌

చెత్తకుండీ నిండిపోయినా కొన్ని ప్రాంతాల్లో శుభ్రం చేయరు.  పర్యావరణ కాలుష్యంతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు.  ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు ‘ట్రాక్‌ ద ట్రాష్‌’ అనే కొత్తరకం యాప్‌ను రూపొందించారు చంఢీగఢ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి బృందం. ఇది ఎలా పనిచేస్తుందంటే..
నగరపాలక సంస్థలకు పారిశుద్ధ్యంలో భాగంగా ఈ యాప్‌ త్వరలో చేయూతకానుంది. ఫోన్‌ ద్వారా దీన్ని చెత్తకుండీలతో అనుసంధానం చేస్తే చాలు. నిండిన చెత్తకుండీల సమాచారాన్ని అందిస్తుంది. దాంతో  అక్కడి నుంచి చెత్తను తరలించొచ్చు. స్మార్ట్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంటు సిస్టమ్‌లో భాగంగా ఛార్వీగోయల్‌ అనే విద్యార్థిని.. తన బృందంతో కలిసి దీన్ని రూపొందించింది. ఈ యాప్‌ను తాజాగా పంజాబ్‌ ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించి ప్రముఖుల ప్రశంసలను అందుకున్నారు వారు.
సెన్సార్ల ద్వారా
ఈ యాప్‌ను ఫోన్‌లో పొందుపరుచుకుని, దీనికి అనుసంధానంగా రూపొందించిన సెన్సార్లను చెత్తకుండీకి అమర్చాలి. వీటి ద్వారా సమాచారం ఫోన్‌కు చేరుతుందని చెబుతోంది ఛార్వీ. ‘మున్సిపాలిటీ వాహనచోదకులకు ఈ యాప్‌ చేయూతగా ఉంటుంది. చెత్తకుండీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ, మార్గనిర్దేశం చేస్తుంది. అంతేకాదు, ఇదే యాప్‌ను ఉన్నతాధికారులు తమ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే, పారిశుద్ధ్య కార్మికులు విధులను సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అనేది గుర్తించొచ్చు. స్కూల్‌లో చదువుకునేటప్పుడే దీన్ని ప్రాజెక్టుగా చేశాం. లఖ్‌నవూలోని ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించి, స్వచ్ఛభారత్‌ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నాం. అప్పటి మా ప్రాజెక్టు ఆలోచనకు ఇప్పుడు యాప్‌గా రూపాన్నిచ్చాం. దీనిపై పేటెంట్‌ హక్కుకు దరఖాస్తు చేసుకున్నాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. కాలుష్యరహితంగా నగరాలను తీర్చిదిద్దడంలో మేమూ భాగస్వాములం కావడం సంతోషంగా ఉంది’ అని అంటోంది ఛార్వి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని