close

తాజా వార్తలు

Published : 09/02/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీవితాంతం పింఛను కోసం..

దవీ విరమణ తర్వాత పింఛను కోసం చూసే వారిని లక్ష్యంగా చేసుకొని మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ సంప్రదాయ యాన్యుటీ పథకం మ్యాక్స్‌ లైఫ్‌ గ్యారంటీడ్‌ లైఫ్‌టైం ఇన్‌కం ప్లాన్‌ ద్వారా పదవీ విరమణ తర్వాత పింఛను వచ్చేలా ప్రణాళిక వేసుకోవచ్చు. ఈ డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా జీవితాంతం వరకూ పింఛను లభించే ఏర్పాటు చేసుకోవచ్చు. నిర్ణీత కాలంపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత పింఛను ఎప్పటి నుంచి కావాలన్నది నిర్ణయించుకోవచ్చు. యాన్యుటీ మొత్తం పెంచుకునేందుకు టాపప్‌ చేసుకునేందుకు వీలు, పాలసీదారుడు మరణిస్తే ప్రీమియం మొత్తానికి 105శాతం వరకూ పరిహారం ఇస్తుంది. అవసరాన్ని బట్టి పింఛనును ఏడాదికోసారి, ఆరు, మూడు నెలలు లేదా నెలకోసారి తీసుకోవచ్చు. పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే వీలుంది. అవసరమైనప్పుడు రుణం తీసుకునేందుకూ అవకాశం ఇస్తుంది. యాన్యుటీ ఆప్షన్‌ను వ్యక్తిగతంగానూ, జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగానూ ఎంచుకునే వీలుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని