close

తాజా వార్తలు

Published : 14/02/2020 00:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫాలో ఫాలో మీ!

ఇది నయా ట్రెండ్‌

వాళ్లిద్దరూ ప్రేమికులు... ప్రియురాలు ముందు నడుస్తుంటే అతడు ఆమెను అనుసరించాడు. ప్రపంచం మొత్తాన్ని తమ కళ్లతో అందంగా చూసేయడమే కాకుండా మనకూ ఆ అందాలని ప్రేమతో పంచాలనుకున్నారు. ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఫాలో మీ ట్రెండ్‌ గురించి...

రష్యాకు చెందిన మురాద్‌ ఉస్మాన్‌కు కనిపించిన ప్రతిదాన్నీ కెమెరాలో బంధించే అలవాటుంది. పదేళ్ల క్రితం తన ప్రేయసి నటాలియా జకరోవాతో కలిసి బార్సిలోనా వెళ్లాడు. అక్కడా ఆమెను పట్టించుకోకుండా ఫొటోలు తీయడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో నటాలియా చిరుకోపంతో ‘రావయ్యాబాబు.. ఎంతసేపు ఇక్కడే ఫొటోలు తీస్తావ్‌... ఇంకా ముందుకు వెళ్లి చూద్దాం రా’ అంటూ ఉస్మాన్‌ చేతిని పట్టుకుని ముందుకు లాక్కెల్లింది. అదే సమయంలో కెమెరా క్లిక్‌మనిపించాడు ఉస్మాన్‌. అంతే ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అతడ్ని ముందుండీ నడిపించిన ‘ఆమె’ చిత్రానికి అభిమానం వెల్లువెత్తింది. ఇక అక్కడనుంచి ఈ ప్రేమ పక్షుల చిత్రానికి ఎన్నో లైకులు, కామెంట్లు. అప్పుడే ఈ జంట ‘ఫాలో మీ’ అనే సిరీస్‌ ప్రారంభించింది. తన ప్రేయసి ఎక్కడ ఉంటే... అక్కడ ప్రియుడు వాలిపోయినట్టుగా ఉంటాయి ఈ చిత్రాలు. వీరు తీసే ప్రతి చిత్రం వెనుక ఒక కథ ఉంటుంది. కష్టం ఉంటుంది. ప్రదేశాలు, దుస్తులు.. ఇలా ఒక ఫొటో కోసం ఎంతో కసరత్తు చేస్తారు. ఈ జంట ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌నీ దర్శించారు. అయిదేళ్ల క్రితం పెళ్లిచేసుకున్న ఈ జంట ఇప్పటికీ అదే అద్భుతమైన చిత్రాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని