
యాత్రలో ఉన్నారు.. క్రెడిట్ కార్డు వాడాల్సి వచ్చింది. జేబులు తడుముకుంటారు. చిన్న కాగితం కోసం హ్యాండ్బ్యాగ్ అంతా వెతికేస్తుంటారు. దీనికి పరిష్కారమే.. మల్టీ ఫంక్షనల్ ట్రావెల్ ఆర్గనైజర్. అరలు అరలుగా ఉండే ఈ బ్యాగు ప్రయాణంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డులన్నీ ఒక అరలో పెట్టుకోవచ్ఛు మరో అరలో డబ్బులు దాచుకోవచ్ఛు పత్రాలు ఉంచొచ్చు, పాస్పోర్టు భద్రంగా పెట్టుకోవచ్ఛు అంతేకాదు, పవర్బ్యాంక్లా కూడా ఇది పనిచేస్తుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి.. ఆ బ్యాగులోనే వేసేస్తే సరి. దీనిని ట్రాలీ సూట్కేస్కు అమర్చుకోవచ్ఛు ఆన్లైన్ అంగట్లో వీటి ధర రూ.1,500 నుంచి రూ.3,000 వరకు ఉంది.