close

తాజా వార్తలు

Published : 19/02/2020 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాట్సాప్‌..వాట్సాప్‌

అప్‌డేట్‌

ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలతో నిత్య నూతనంగా వినియోగదారుల్ని అలరిస్తున్న వాట్సాప్‌ మరికొన్ని వినూత్న సౌకర్యాలతో ముందుకొచ్చేస్తోంది..డార్క్‌మోడ్‌, ఇన్‌యాప్‌ పేమెంట్స్‌, బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌, గ్రూపు ప్రైవసీ కంట్రోల్స్‌ తర్వాత.. ఇంకొన్ని పలకరించేందుకు సిద్ధం అవుతున్నాయ్‌. అవేంటంటే..

షాపింగ్‌ చేయొచ్చు

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా షాపింగ్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టిందో అదే మాదిరిగా వాట్సాప్‌లోనూ యూజర్లు షాపింగ్‌ చేయొచ్ఛు అమ్మకం దారులు పెట్టిన కేటలాగ్‌ని బ్రౌజ్‌ చేసి కొనుగోలు చేయొచ్ఛు యాప్‌ నుంచే చెల్లింపులు చేసే విధానాన్నీ అందించనుంది.

ఆటోమేటిక్‌ డిలీట్‌

ఏదైనా మెసేజ్‌ను పంపాక అది నిర్ణీత సమయం తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయిపోతే! యూజర్‌ ప్రైవసీని కాపాడుకున్నవారు అవుతారు. ఇదే ఆప్షన్‌ను వాట్సాప్‌ త్వరలో ప్రవేశపెట్టనుంది. దీంతో మీరు ఎవరికైనా ఏదైనా పంపాక ఒక గంట, రోజు, వారం, నెలలో ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయ్యేలా చేయొచ్ఛు గంట తర్వాత డిలీట్‌ అయ్యేలా పెట్టుకుంటే.. ప్రతి గంటకీ మీరు పంపే డేటా గంటకోసారి ఛాట్‌ బాక్స్‌ నుంచి తొలగిపోతుంది.

వీడియోలనూ..!

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాగైతే ‘బూమరింగ్‌ వీడియోలు’ క్రియేట్‌చేసి షేర్‌చేస్తున్నామో.. అదే మాదిరిగా వాట్సాప్‌లోనూ వాటిని క్రియేట్‌చేయొచ్ఛు క్రియేటివ్‌గా, నవ్వు పుట్టించేలా చిన్న చిన్న వీడియో క్లిప్‌లను తయారు చేసి కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఎవరికైనా క్షణాల్లో పంపొచ్ఛు

యాప్‌లోనే బ్రౌజర్‌

వాట్సాప్‌కి వచ్చిన ఏదైనా లింక్‌ని క్లిక్‌ చేస్తే యాప్‌ని వదిలి బ్రౌజర్‌లోకి వెళ్లాల్సిందే. ఇకపై అలాంటి సమస్య లేకుండా వాట్సాప్‌లోనే లింక్‌లను ఓపెన్‌ చేసుకోవచ్చట. అందుకోసం ప్రత్యేకంగా ‘ఇన్‌-యాప్‌ బ్రౌజర్‌ని సిద్ధం చేస్తోంది. ఏదైనా మాలిషియస్‌ లింక్‌ని ఓపెన్‌ చేస్తున్నట్లయితే బ్రౌజర్‌ హెచ్చరిస్తుంది కూడా.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని