close

తాజా వార్తలు

Published : 22/02/2020 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ ధ్వని70 కోట్లగుండెల్ని తడిమింది!

కట్టుకునే గాత్రం.. పాటలో విషయం ఉంటే రికార్డులు వెతుక్కుంటూ వస్తాయని నిరూపించింది ముంబయి అమ్మాయి ధ్వని భానుశాలి. ఇరవై రెండేళ్ల ఈ గాయని పాడిన ‘వాస్తే’ హిందీ ఆల్బమ్‌ను 70 కోట్ల మంది వీక్షించారు. ఇది రికార్ఢు ఇలా అతిచిన్న వయసులో ఇంతమంది అభిమానులను సంపాదించుకోవడమూ అరుదే. యూట్యూబ్‌లో ఈ ఆల్బమ్‌ ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 10లో ఒకటిగానూ నిలిచింది. బాలీవుడ్‌ సినిమా చఫె్‌లో తను పాడిన మొదటి పాట ‘తేరే మేరే..’తో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. తర్వాత ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పాపులర్‌ కావడంతో సామాజిక మాధ్యమాల్లో తనకు అభినందనలు పోటెత్తుతున్నాయి. ‘వాస్తే’ శ్రోతలు, వీక్షకులకు విపరీతంగా నచ్చడమే కాదు మిర్చీ మ్యూజిక్‌ అవార్డుల్లో ‘లిజనర్స్‌ ఛాయిస్‌ ఇండిపెండెంట్‌’ పురస్కారాన్నీ కొట్టేసింది. ముంబయి విశ్వవిద్యాలయంలో కామర్స్‌లో డిగ్రీ చదివిన ధ్వని తర్వాత బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కోర్సు పూర్తి చేసింది. ఓవైపు చదువుకుంటూనే, మరోవైపు సంగీతంపై ఉన్న మమకారంతో ఆ రంగంలో శిక్షణ తీసుకుంది. నేటితరం అభిరుచులకు తగ్గట్టు పాటలు పాడాలనుకుంది. శిక్షణ తర్వాత బాలీవుడ్‌ చిత్రాల్లో అవకాశాలు రావడంతో ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’, ‘వీరే ది వెడ్డింగ్‌’, ‘సత్యమేవ జయతే’లతో మొదలుపెట్టి ముప్పైవరకు పాటలు పాడింది. నేపథ్య గాయనిగా అవకాశాలు కొల్లగొడుతోంది. సొంతంగా ఆల్బమ్‌లు రూపొందిస్తూ సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది ధ్వని.

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని