close

తాజా వార్తలు

Published : 22/02/2020 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిల్లలకు నచ్చింది...మెలానియామెచ్చింది!

అనగనగా ఓ బడి...

అక్కడ ఓ తరగతిలో పిల్లలందరూ టీచర్‌ ముందే నాటకాలు వేస్తున్నారు...

ఇంకో తరగతిలోని విద్యార్థులు మాస్టారు ఉన్నా ఇష్టం వచ్చినట్లు కథలు చెప్పుకుంటున్నారు. మరో తరగతిలో పేపర్‌పై నచ్చినట్లు గీతలు గీస్తున్నారు...

అయ్యో ఇవేం అల్లరి చేష్టలు అనుకుంటున్నారా? కాదండోయ్‌...

దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే హ్యాపీనెస్‌ తరగతుల తీరు ఇలానే ఉంటుంది.

వీటి గురించి తెలుసుకోవాలని ముచ్చటపడిన

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ త్వరలో ఈ తరగతులకు హాజరు కానుంది..

ప్పుడూ చదువు... చదువు.. అని వెంటపడే పాఠశాలల్నే చూసుంటాం. కానీ దిల్లీలోని బడులు మాత్రం భిన్నంగా ఉంటాయి. హ్యాపీనెస్‌ కరికులం పేరుతో పిల్లలతో రకరకాల కార్యక్రమాలు చేయిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా ఓ క్లాస్‌ ఉంటుంది. దీంట్లో పిల్లలు ఏమేం చేస్తారంటే...

మనసును ప్రశాంతంగా మార్చుకోవడం కోసం కొంతసేపు ధ్యానం చేస్తారు. రెండు చేతులను బాగా రుద్దుకొని కళ్లపై పెట్టుకుంటారు. ఆ నిశ్శబ్దంలో ప్రకృతిలో జరిగే మార్పులు గమనిస్తారు. తమ గుండె చప్పుళ్లని వింటారు. శ్వాస మీద ధ్యాస పెడతారు.

మనసుకు హద్దులు ఉండవు. అది ఎక్కడికైనా పయనించగలదు. అలా మనసు చెప్పే ఊసులని, మదిలో కలిగే భావాలను ఒక పెన్ను, పేపర్‌ తీసుకొని కాగితం మీద పెడతారు. వారికి కలుగుతున్న అనుభూతులు రాయడానికి, గీయడానికి ప్రయత్నిస్తారు.

ఏ జంకూ లేకుండా స్నేహితులతో సరదాగా మాట్లాడతారు. కథలు చెప్పుకుంటారు. నాటకాలు వేస్తారు. ఒక అంశంపై మాట్లాడుతూ ఇది ఇలాగే ఎందుకు ఉండాలి... అలా ఉండకూడదా... అంటూ చర్చల్లోకి దిగుతారు. ఇవే కాదు.. మరెన్నో ఇండోర్‌ గేమ్స్‌ కూడా ఉంటాయి.

ఇవి లాభాలు...

ఈ హ్యాపీనెస్‌ కరికులం పిల్లల్లో ఉండే ఒత్తిడిని దూరం చేస్తుంది. ఎన్నో విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి సాయం చేస్తుంది. బృంద చర్చల ద్వారా ప్రశ్నించడం, శ్రద్ధగా వినడం, వారి భావాలు వివరంగా వ్యక్తపరచడం వంటివి అలవడతాయి. సృజనాత్మకత మెరుగవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. క్రిటికల్‌ థింకింగ్‌, సమస్య సాధన వంటివి తెలుస్తాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని