close

తాజా వార్తలు

Published : 05/03/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వారితో కఠినంగా మాట్లాడొద్దు!

ఇస్లాం సందేశం

ఎవరి ఇంట్లో ఆడ శిశువు పుడుతుందో ఆ ఇంట్లో దైవదూతలు దిగివస్తారు. ఆ ఇంటివారిని దీవిస్తారు.

అమ్మాయి ఇష్టంతోనే పెళ్లి జరపాలి. వాళ్ల అంగీకారం లేకుండా చేసిన పెళ్లి చెల్లదు. అలాంటి వివాహం రద్దు అవుతుంది.

మీ భార్యను పొగడండి. ఆమె చేసే పనుల్ని ప్రశంసించండి. ఆమె తప్పుల్ని, ఆమె లోపాలను మన్నించండి

-ప్రవక్త (స)

‘ఓ ముహమ్మద్‌ నీ సతీమణి ఖదీజా (రజి) కాసేపట్లో నీదగ్గరికి రానుంది. ఆమె రాగానే ‘అల్లాహ్‌ సలాములు చెప్పాడ’ని చెప్ఫు..అని జిబ్రాయీల్‌ దైవదూత అంతర్థానమయ్యారు.

మహాప్రవక్త ముహమ్మద్‌, హజ్రత్‌ ఖదీజా(రజి) ఆదర్శ దంపతులు. ప్రవక్త (స) హిరా గుహలో ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఖదీజా ఆహారం వండి ప్రవక్త కోసం తీసుకుని వచ్చేవారు. ఆ కాలంలో హిరా గుహ మార్గమంతా దుర్గమంగా ఉండేది. ఎంతో ఎత్తులో ఉన్న ఆ గుహకు చేరుకోవడమంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సివచ్చేది. తన భర్త ఆకలి తీర్చేందుకు ఖదీజా పడుతున్న తాపత్రయం, ఆత్రుత, కృషి అల్లాహ్‌కు ఎంతగానో నచ్చాయి. అందుకే ఖదీజాకు సలాములు చెప్పాలని దేవదూతతో సందేశం పంపారు. అందుకే అంటారు... జీవితంలో ఇద్దరిని గౌరవించడం మరవద్దు అని. మిమ్మల్ని ప్రపంచంలోకి తెచ్చిన అమ్మను. నీకోసం తన ప్రపంచాన్ని వదిలేసి వచ్చిన భార్యను. ఏ సమాజంలోనైతే ఆడవాళ్లు ఆదరణ పొందుతారో అలాంటి సమాజం పురోగమిస్తుంది. ఆడవాళ్లకు ప్రేమ, మృదుత్వంతో చెప్పే మాటలే అర్థమవుతాయి. అందుకే వారితో కఠినంగా మాట్లాడకండి... అని చెప్పారు ప్రవక్త (స). స్త్రీలను గౌరవించి ఆదరించడంకంటే వారికిచ్చే గొప్ప బహుమానాలేమీ లేవు అని ఉలేమాలు అంటారు. ఆడవాళ్లను సుఖపెట్టలేని పెద్ద పెద్ద భవంతులకంటే వారిని ఆదరించి చూసుకునే పూరి గుడిసెలే మేలంటారు పెద్దలు.

-ఖైరున్నీసాాబేగం


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని