close

తాజా వార్తలు

Published : 06/03/2020 00:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అతివలకో ర్యాలీ

మహిళా దినోత్సవ సందర్భం

పోటీలు, రేస్‌లు, పందేలు, ర్యాలీలు మగాళ్లకేనా? ఆసక్తి, ఉత్సాహం ఉన్న మహిళా డ్రైవర్లూ తమ డ్రైవింగ్‌ సత్తా చూపించే అవకాశం కల్పిస్తామంటోంది వెస్ట్రన్‌ ఇండియా ఆటోమొబైల్‌ అసోసియేషన్‌ (డబ్ల్యూఐఏఏ). ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఔత్సాహిక అతివల కోసం కారు డ్రైవింగ్‌ ర్యాలీ నిర్వహిస్తోంది. ముంబయిలోని నారీమన్‌ పాయింట్‌ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాంబీ వ్యాలీ సిటీ వరకు పోటీ. మార్చి 8న నిర్వహించే ఈ పోటీలో ఎవరైనా పాల్గొనవచ్ఛు ప్రయాణంలో ఉన్నప్పుడు నిర్ణీత వేగం మించకూడదు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలనే నియమాలు ఉన్నాయి. గతేడాది నిర్వహించిన ర్యాలీలో 600 మంది అతివలు పాల్గొన్నారు. ఈసారీ ఎక్కువే ఉండొచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.


తరుణులకు తగ్గింపు

ఆఫర్‌ వర్తింపు: మార్చి 2 నుంచి 8 వరకు.

హిళల కోసం మహిళా దినోత్సవాన రెనాల్ట్‌ కంపెనీ ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ తీసుకొచ్చింది. రెనాల్ట్‌ సంస్థకు చెందిన కారు యజమానులు ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవచ్ఛు ఉచిత వాహన తనిఖీ, పదిశాతం లేబర్‌ డిస్కౌంట్‌, విడిభాగాల మీద రాయితీలు, రోడ్‌సైడ్‌ అసిస్టెంట్‌, కొత్తగా వాహనం కొంటే రెనాల్ట్‌ అస్యూర్‌ ఇన్సూరెన్స్‌ కింద బీమాలో భారీ తగ్గింపు ఉంటుంది. వాహనం కొనుగోలు చేసే ప్రతి మహిళా వినియోగదారుకి తప్పకుండా ఏదో ఒక గిఫ్ట్‌ అందిస్తామంటున్నారు. పనిలో పనిగా వాహనాన్ని సొంతంగా నిర్వహించడానికి, చిన్నచిన్న మరమ్మతులు చేయగలిగేలా శిక్షణనిస్తారు. ఈ సమాజ ప్రగతిలో ఎంతో కీలకమైన స్త్రీని గౌరవించడానికి వారం రోజులపాటు ఈ ఆఫర్‌ అందిస్తున్నామని రెనాల్ట్‌ చెబుతోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన