close

తాజా వార్తలు

Published : 16/03/2020 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

2000 ప్రదర్శనలు 100 పురస్కారాలు

‘కథక్‌’ నేర్చుకోవాలంటేనే చాలా కష్టం. మరి కథక్‌కే కొత్త రూపాన్ని ఇవ్వాలంటే...?

ఈ బృహత్తర ప్రక్రియను పూర్తిచేసి కళకే కొత్త కళతెచ్చారు హైదరాబాద్‌కు చెందిన అంజిబాబు. కథక్‌ ఘరానాకు దక్కన్‌ శైలిని ఆపాదించారు. కథక్‌ కళాక్షేత్రాన్ని నగరంలో స్థాపించి వేలాది మందికి శిక్షణ ఇస్తున్నారు.
కథక్‌ నేర్చుకోవడం, ప్రదర్శించడం, అవార్డులు పొందడం చాలా మంది చేస్తుంటారు. అంజిబాబు ఇందుకు భిన్నంగా ఆలోచించి కథక్‌కు ఓ ప్రత్యేక శైలి ఉండాలని భావించారు. తాను పుట్టిన దక్కన్‌ నేలను ఆరాధిస్తూ దక్కన్‌ కథక్‌ శైలిని ఆవిష్కరించి అందరి మెప్పు పొందారు. ఈ శైలిలోనే ఇప్పటి వరకు వందల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు. గుంటూరు వాస్తవ్యులైన అంజిబాబుకి చిన్నతనంలోనే నృత్యంపై ఆసక్తి పెరిగింది. దీనిని గమనించిన ఆయన తల్లి ప్రోత్సహించారు. హైదరాబాద్‌లోని త్యాగరాయ సంగీత కళాశాలలో చేరారు. అనంతరం కథక్‌ నేర్చుకోవడానికి పండిట్‌ రామక్రిష్ణ శుక్లా వద్ద చేరారు. ఓ వైపు శిక్షణ పొందుతూనే ప్రపంచవ్యాప్తంగా 2000 ప్రదర్శనలు ఇచ్చారు. 40కి పైగా డ్యాన్స్‌ డ్రామాలకు, టీవీ కార్యక్రమాలకు కొరియోగ్రఫీ చేశారు. 25 ఏళ్ల క్రితం కథక్‌ కళాక్షేత్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించి కళను నేటి తరానికి అందిస్తున్నారు. అంజిబాబు తన ప్రదర్శనల ద్వారా ఇప్పటి వరకు 100 అవార్డులు పొందారు. నృత్య భూషణ్‌, సిల్వర్‌ క్రౌన్‌ పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు, సత్కారాలు పొందారు. కథక్‌పై ఉన్న అభిమానంతో ‘కథక్‌ నృత్య వికాసం’ పుస్తకాన్ని రచించి యువతకు అందుబాటులోకి తెచ్చారు. అందుకే ఆయన ‘కథక్‌ అంజిబాబు’గా పేరుపొందారు.

- కాసాల ప్రశాంత్‌గౌడ్‌, హైదరాబాద్‌


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని