
తాజా వార్తలు
చీమలు చెప్పిన సామాజిక బాధ్యత!
ఇస్లాం సందేశం
‘‘చీమలారా! మీరు మీ పుట్టలలోకి దూరిపొండి,
లేకపోతే సులైమాన్, అతని సైనికులు మిమ్మల్ని నలిపివేస్తారు. ఆ సంగతి వారికి తెలియకపోవచ్చు కూడా.’’ (దివ్యఖుర్ఆన్ 27:18, 19)
అనేక సంవత్సరాల క్రితం ప్రవక్త సులైమాన్ (అలైహిస్సలామ్) అనే ప్రవక్త ఉన్నారు. ఆయనకు పక్షులు, జంతువులతో పాటు పంచభూతాలను అర్థం చేసుకునే, వాటితో మాట్లాడే శక్తి ఉండేది. ఒకసారి ఆయన అడవిలో నుంచి తన సైన్యంతో కలిసి బయలుదేరారు. అటుగా వస్తున్న గుర్రపు డెక్కల శబ్దాన్ని ఓ చీమ పసిగట్టింది. తనతోపాటు తోటి చీమల ప్రాణాలనూ కాపాడాలనే ఉద్దేశంతో వాటిని అప్రమత్తం చేసింది. హుటాహుటిన అవన్నీ గుంపుగా పుట్టలో దూరాయి. ఈ సంఘటనకు ప్రవక్త సులైమాన్ ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ చీమ ప్రదర్శించిన ఈ బాధ్యతాయుతమైన ఈ మాటలు అల్లాహ్కు ఎంతగానో నచ్చాయి. వాటిని ఖుర్ఆన్లో పొందుపర్చారు. బాధ్యతగా మసలుకోవడం ముఖ్య ధార్మిక విధిగా బోధించారు ప్రవక్త ముహమ్మద్. సామాజిక శ్రేయస్సు కోసం పాలకుల సూచనలను ఎలాంటి అరమరికలు లేకుండా పాటించాలని షరియత్ నొక్కిచెబుతోంది.
-ఖైరున్నీసాబేగం