close

తాజా వార్తలు

Published : 20/04/2020 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభుత్వ ఉద్యోగాలు

డీఆర్‌డీఓ-ఆర్‌ఏసీలో సైంటిస్టులు

దిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ)కి చెందిన రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ) విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సైంటిస్ట్‌ మొత్తం ఖాళీలు: 40 విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఐటీ, ఫైర్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://rac.gov.in/

ఈఎస్‌ఐసీ, హైదరాబాద్‌

నత్‌నగర్‌(హైదరాబాద్‌)లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ) మెడికల్‌ కాలేజీ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 35 పోస్టులు-ఖాళీలు: సూపర్‌ స్పెషలిస్ట్‌-10, స్పెషలిస్ట్‌-1, సీనియర్‌ రెసిడెంట్స్‌-24. విభాగాలు: కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రేడియాలజీ, యూరాలజీ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరి తేది: ఏప్రిల్‌ 26, 2020. వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/

ఎన్‌ఐడీ, మధ్యప్రదేశ్‌

భోపాల్‌(మధ్యప్రదేశ్‌)లోని భారత ప్రభుత్వ కామర్స్‌, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 16 పోస్టులు: సీనియర్‌ డిజైనర్‌, అసోసియేట్‌ సీనియర్‌ డిజైనర్‌, ప్రిన్సిపల్‌ టెక్నికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, డిజైనర్‌, డిప్యూటీ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/ డిప్లొమా, బీఈ/ బీటెక్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: మే 17, 2020. వెబ్‌సైట్‌: https://www.nidmp.ac.in/

ప్రవేశాలు

కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌

తెలంగాణ(వరంగల్‌)లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌(కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) పరిధిలోని వైద్య కళాశాలల్లో 2020-21 సంవత్సరానికిగాను కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.

పీజీ వైద్య విద్య ప్రవేశాలు అర్హత: ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: నీట్‌ పీజీ 2020/ నీట్‌ ఎండీఎస్‌ 2020లో కటాఫ్‌ స్కోరు కంటే ఎక్కువ పొందిన అభ్యర్థులను కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్‌ 20, 2020. దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 25, 2020.

వెబ్‌సైట్‌: http://knruhs.telangana.gov.in/

ఏపీలో పీజీ వైద్య విద్య ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పరిధిలోని వైద్య కళాశాలల్లో 2020-21 సంవత్సరానికిగాను కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.

పీజీ వైద్య విద్య ప్రవేశాలు అర్హత: ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ ఉత్తీర్ణత. ఎంపిక: నీట్‌ పీజీ 2020/ నీట్‌ ఎండీఎస్‌ 2020లో కటాఫ్‌ స్కోరు కంటే ఎక్కువ పొందిన అభ్యర్థులను కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్‌ 20, 2020. దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 26, 2020.

వెబ్‌సైట్‌: http://ntruhs.ap.nic.in/

ఎన్‌ఐటీటీటీఆర్‌, చండీగఢ్‌

చండీగఢ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రెయినింగ్‌ అండ్‌ రిసెర్చ్‌(ఎన్‌ఐటీటీటీఆర్‌) 2020-021 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

●స్టర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (ఎంఈ-రెగ్యులర్‌/ మాడ్యులర్‌ ప్రోగ్రాములు)

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, వాలిడ్‌ గేట్‌ స్కోర్‌. ఎంపిక విధానం: వాలిడ్‌ గేట్‌ స్కోర్‌/ అదర్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఓసెట్‌) ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: ఎంఈ(మాడ్యులర్‌ ప్రోగ్రాములు)- మే 20, 2020, ఎంఈ(రెగ్యులర్‌ ప్రోగ్రాములు)-జులై 06, 2020.

వెబ్‌సైట్‌: http://nitttrchd.ac.in/

ఐఐఐటీడీఎం, జబల్‌పూర్‌

బల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌(ఐఐఐటీడీఎం) 2020-21 విద్యా సంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ/ మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రాములు అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత, వాలిడ్‌ గేట్‌ స్కోర్‌. ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: మే 08, 2020. వెబ్‌సైట్‌: https://www.iiitdmj.ac.in/



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని