close

తాజా వార్తలు

Updated : 08/05/2020 00:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓజోన్‌ పొర ఎక్కడ ఉంటుంది?

ప్ర: ఓజోన్‌ పొర ఎక్కడ ఉంటుంది? ఎలా తయారవుతుంది? మన కంటికి కనబడదా?

-కడలి సాయిశ్రీ, 9వ తరగతి, జడ్పీహెచ్‌ స్కూలు, మొగల్తూరు

ఆక్సిజన్‌ రూపాంతర స్థితి ఓజోన్‌. ఆక్సిజన్‌లో రెండు ఆక్సిజన్‌ పరమాణువులు ఉంటాయి. ఓజోన్‌ అణువులో మూడు ఆక్సిజన్‌ పరమాణువులు ఉంటాయి. భూతలం నుంచి దాదాపు 35 కిలోమీటర్ల ఎత్తులో ఓజోన్‌ పొర కనిపించని గొడుగులా విస్తరించుకుని ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి విడుదల అయ్యే అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటుంది. ఈ పొర లేకుంటే అతినీలలోహిత కిరణాలు భూమి మీద ఉన్న వృక్ష, జంతు, జీవరాశులన్నింటికీ హాని కలిగిస్తాయి. ఈ ఓజోన్‌ భూతలం నుంచి 16 కిలోమీటర్ల ఎత్తు నుంచి 55 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న వాతావరణ పొర స్ట్రాటోస్పియర్‌లో ఉంటుంది. దీని కింది పొరను ట్రోపోస్పియర్‌ అంటారు. ఈ ట్రోపోస్పియర్‌ నుంచి పైకి వెళుతున్న ఆక్సిజన్‌ సూర్యుడి నుంచి వస్తున్న అతినీలలోహిత కిరణాల శక్తిని గ్రహిస్తుంది. ఈ శక్తి ఆక్సిజన్‌ అణువులోని రెండు పరమాణువులను విడదీస్తుంది. ఈ పరమాణువు మరొక ఆక్సిజన్‌ అణువుతో చేరి ఓజోన్‌గా మారుతుంది. ఈ ప్రాంతంలో వాతావరణం కింది పొరలకన్నా ఎక్కువ వేడిగా ఉండటం వల్ల ఈ ఓజోన్‌ నేలకు చేరే అవకాశం ఉండదు. ఈ వాయువు మన కంటికి కనపడదు. ఉపగ్రహాల (శాటిలైట్లు) ద్వారా ఓజోన్‌ ఉనికిని గుర్తించవచ్చు.
 

- డాక్టర్‌ సి.వి. సర్వేశ్వర శర్మ,  
ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌, అమలాపురం


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని