
తాజా వార్తలు
సిప్ చేస్తే లాభమేనా?
నెలకు రూ.4,000 వరకూ వీపీఎఫ్లో జమ చేస్తున్నాను. దీన్ని ఆపేసి, మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా? ఏ ఫండ్లను ఎంచుకోవాలి? - శ్వేత
మీరు ఈపీఎఫ్, వీపీఎఫ్లో జమ చేస్తున్నారు. ఈ రెండూ సురక్షితమైన పథకాలే. వీటి ద్వారా వచ్చే వడ్డీకి పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ఇందులో ప్రస్తుతం 8.5శాతం వడ్డీ వస్తోంది. మీరు వీపీఎఫ్కు కేటాయిస్తున్న మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లకు మళ్లించండి. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా యాక్సిస్ మల్టీ క్యాప్ ఫండ్, మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్లను పరిశీలించవచ్ఛు కనీసం 7-10 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగించండి. సగటున 12-13శాతం వరకూ రాబడిని ఆశించవచ్ఛు.
Tags :