
తాజా వార్తలు
డేటాసైన్స్‌లో పీజీ ఎలా?
మీరు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూనే ఎంఎస్సీ డేటాసైన్స్ కోర్స్ గురించి ఆలోచించడం అభినందనీయం. డిగ్రీని మాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో చదవాలనుకొంటున్నారు కాబట్టి డేటాసైన్స్ సబ్జెక్ట్‌లోకి ప్రవేశించబోతున్నట్టే . మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టుల్లో ఆసక్తి, పట్టు ఉన్నవారికి డేటా సైన్స్ చదవడం సులువు. డేటాసైన్స్ లో నిష్ణాతులు అవ్వడానికి తార్కిక, విశ్లేషణాత్మక నైపుణ్యాలు చాలా అవసరం. ప్రస్తుతానికి మనదేశంలో డేటా సైన్స్‌కి సంబంధించి కొన్ని వర్సిటీలు మాత్రమే ఎం.ఎస్సి కోర్సును అందిస్తున్నాయి. మీరు డిగ్రీ పూర్తి చేసేనాటికి చాలా ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ, రాష్ట్ర, ప్రయివేటు యూనివర్సిటీలు ఎంఎస్సీ డేటాసైన్స్, ఎంఎస్సీ బిగ్ డేటా, ఎంఎస్సీ డేటా ఎనలిటిక్స్ లాంటి కోర్సులని అందిస్తాయి. ఇవి కాకుండా విదేశాల్లో చాలా విశ్వవిద్యాలయాలు ఈ కోర్సుని అందిస్తున్నాయి. అప్పటికి మీరు ఎంబీఏ వైపు వెళ్లాలనుకొంటే డేటాసైన్స్ అప్లికేషన్స్ ఎక్కువగా ఉండే ఎంబీఏ బిజినెస్ ఎనలిటిక్స్ లాంటి కోర్సులనూ చదవవచ్ఛు
- ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్