
తాజా వార్తలు
ఆరోగ్యాన్నిచ్చే గింజలు...
నేతిలో వేయించిన జీడిపప్పులు నాలుగుపడితే పాయసానికి ఎక్కడలేని రుచీ వస్తుంది. పాలు పేరుచెబితే పారిపోయే పిల్లలు కూడా బాదంపాలు అంటే ఎగిరిగంతేస్తారు. డ్రైఫ్రూట్స్ పదార్థాలకు రుచిని తీసుకురావడంతో పాటు పోషకాలనీ అందిస్తాయి.
పిస్తా: దీంట్లో విటమిన్లు, ఖనిజాలు నిండుగా ఉంటాయి. అధిక రక్తపోటు నుంచి కాపాడుతుంది. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. మధుమేహ బాధితులకూ మేలు చేస్తుంది. అయితే వీటిని మితంగా తినాలి.
బాదం: శరీరంలో చెడు కొవ్వును తగ్గిస్తుంది. మంచి కొవ్వును పెంచుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. గ్లూకోజ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంట్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దాంతో బీపీ అదుపులో ఉంటుంది.
వాల్నట్స్: దీంట్లో మాంసకృత్తులు, పీచు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-బి, యాంటీ ఆక్సిడెంట్లూ ఉంటాయి. అధిక బరువును నియంత్రిస్తుంది. మెదుడు చురుగ్గా పని చేసేలా చేస్తుంది.