close

తాజా వార్తలు

Published : 22/06/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మమ్మ చెప్పిన సున్నిపిండి

అందాన్ని మెరుగుపరుచుకోవడానికి మార్కెట్‌లో ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చినా... అమ్మమ్మల కాలం నాటి సున్నిపిండిని మించిందేదీ లేదు. కాలం ఏదైనా దీన్ని ఒంటికి పట్టించి రుద్దితే అద్భుతమైన ప్రయోజనాలని అందుకోవచ్చు....
* సున్నిపిండిలోని సెనగపిండి, పెసరపిండి, బియ్యప్పిండి వంటివి ప్రధానంగా ఉంటాయి. ఇవి చక్కని స్క్రబ్‌లా పనిచేసి.. చర్మంపై పేరుకున్న మృతకణాలని తొలగిస్తాయి.
* సున్నిపిండిలో కలిపే పసుపు, తులసి వంటివి యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మచ్చలు లేకుండా చేసి చర్మచాయని పెంచుతాయి. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వంటివి రాకుండా చేస్తాయి. కమలాఫలం తొక్కల పొడి, గులాబీరేకల మిశ్రమం వంటివి కలిపితే  వాటిల్లోని విటమిన్‌ ఎ, సిలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి
* దీనిలోని వట్టివేర్ల పొడి చర్మంపై ఉండే టాన్‌ని తొలగిస్తుంది. కొందరు కొద్దిగా  పచ్చకర్పూరం కూడా కలుపుతారు. దాంతో ఆ పరిమళం మనసుని, మెదడుని తేలికపరుస్తుంది.
* సున్నిపిండిలో కాస్త నువ్వులనూనె వేసి ఒంటికి పట్టిస్తే చర్మానికి రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. హాయిగా నిద్రపడుతుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని