close

తాజా వార్తలు

Published : 07/08/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిమ్‌కి వెళ్తుంటే....

జిమ్‌లు తెరిచేశారు. వర్కవుట్లు మొదలయ్యాయి. అయితే జిమ్‌కు వాడే వస్తువులు, వాటి శుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారా...

గ్లోవ్స్‌: చేతులకు సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించే గ్లోవ్స్‌ని వ్యాయామం తర్వాత షాంపూ వేసిన నీటిలో నానబెట్టి ఉతికేయాలి.

స్పోర్ట్స్‌ బ్రా: నాణ్యమైన వాటిని మాత్రమే ఎంచుకోవాలి. గోరువెచ్చటి నీటిలో గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్‌ వేసి వీటిని నానబెట్టాలి. తర్వాత చేతులతో మృదువుగా రుద్దుతూ శుభ్రం చేస్తే సరిపోతుంది.

యోగా మ్యాట్‌: కప్పు డిస్టిల్డ్‌ వాటర్‌లో కొన్ని చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి కీన్లింగ్‌ సొల్యూషన్‌ను తయారుచేసుకోవాలి. దీన్ని స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. వర్కవుట్‌, యోగ చేసిన ప్రతిసారీ మ్యాట్‌ అంతా స్ప్రే చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడిచేస్తే సరి.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని