close

తాజా వార్తలు

Published : 17/08/2020 00:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎండుద్రాక్ష... ఆరోగ్యానికి రక్ష

చాలామందికి ఎండుద్రాక్ష ప్రాధాన్యం అంతగా తెలియదు. దీన్ని కేవలం స్వీట్లలో వాడే ఓ పదార్థంగానే చూస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలను గమనిస్తే వదిలిపెట్టరు. అవేంటంటారా?●

* బరువు తగ్గాలనుకునేవారికి ఎండుద్రాక్షల్ని రాత్రిపూట నానబెట్టుకుని ఉదయం తింటే సరి. వీటిల్లోని గ్లూకోజ్‌ శరీరానికి శక్తినిస్తుంది. ఇవి రోగనిరోధకశక్తినీ పెంచుతాయి. పైగా కొన్నితిన్నా పొట్టనిండినట్లు అనిపిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌, క్యాన్సర్‌ కారకాలూ దూరమవుతాయి.

* మహిళల్లో క్యాల్షియం లోపం ఎక్కువ కనిపిస్తుంది. రోజూ నాలుగైదు ఎండుద్రాక్షల్ని పాలల్లో నానబెట్టుకుని తింటే వీటిల్లోని క్యాల్షియం, బోరాన్‌ పోషకాలు ఎముకలకు బలాన్నిస్తాయి.

* నెలసరి మొదలయ్యాక అమ్మాయిల్లో ఎక్కువగా కనిపించే సమస్య రక్తహీనత. ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల ఇనుము, రాగి, విటమిన్‌ బి పోషకాలు శరీరానికి అందుతాయి. ఇవన్నీ ఎర్రరక్తకణాల వృద్ధిని పెంచడంలో దోహదం చేస్తాయి.

* నోటి దుర్వాసనా, చిగుళ్ల సమస్యలు ఉండేవారు ఎండుద్రాక్షల్ని నమిలితే ఉపశమనం ఉంటుంది.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని