
తాజా వార్తలు
సై.. సై.. సవాల్!
1. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆటగాడి పేరు మీకు తెలిసే ఉంటుంది. అవును మీరు చెప్పింది నిజం.. అతడు ధోనీనే. మరి ధోనీ టీమిండియా జెర్సీపై ఏ అంకె ఉండేదో తెలుసా?
2. మీరు డోరా కార్టూన్ షో చూస్తుంటారు కదూ! ఈ చిత్రంలో డోరాతో పాటు ఉన్నది ఎవరో కాస్త చెప్పగలరా?
3. చూడటానికి ముద్దుగా ఉన్న ఈ పక్షి చేపల్ని పట్టడంలో భలే నేర్పరి. దీని పేరేంటో తెలుసా?
టీచర్: కరోనా వల్ల మనకు తెలిసింది ఏంటి?
చింటు: పందుల్లా గుంపుగా ఉండకుండా.. సింహంలా సింగిల్‌గా ఉండాలని.. టీచర్!
-ఆర్. గీతామాధురి, అయిదో తరగతి, నెల్లిమర్ల, విజయనగరం
టీచర్: లల్లీ.. ఆన్లైన్క్లాసులు నీకు నచ్చాయా?
లల్లి: ఓ.. బాగా నచ్చాయ్ టీచర్!
టీచర్: అవునా.. ఎందుకని లల్లీ?
లల్లి: మరేమో.. ఈ ఆన్లైన్క్లాసుల్లో మీరు తిట్టగలరు కానీ కొట్టలేరుగా!
- దొరై, ఏలేశ్వరం
తమాషా ప్రశ్నలు
1. మనతో ఏమాత్రం పరిచయం లేకపోయినా ‘పైకి రావాలి.. పైకి రావాలి’ అంటూ ప్రోత్సహించేది ఎవరు?
2. ఎవరినైనా సరే ‘నవ్వండి.. నవ్వండి’ అంటూ తాపత్రయ పడే వ్యక్తి ఎవరు?
3. జీవితాంతం మనతోపాటే వచ్చే పాము?
సుడోకు
ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.
జవాబులు:
సై.. సై.. సవాల్: 1.7 2.బుజ్జి 3.కింగ్ ఫిషర్ తమాషా ప్రశ్నలు : 1.కండక్టర్ 2.ఫొటోగ్రాఫర్ 3.వెన్నుపాము కవలలేరి : 1,3
సుడోకు