close

తాజా వార్తలు

Published : 24/08/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బ్యాగు ఎంత బాగుందో..

అన్ని అవసరాలకూ, సందర్భాలకూ ఒకటే బ్యాగుని ఎంచుకుంటే ఏం కొత్తదనం ఉంటుంది చెప్పండి. అసలు ఏ సందర్భానికి ఏవి బాగుంటాయో తెలిస్తే...వాటిని ఎంచుకుని ఎంచక్కా మెరిసిపోవచ్ఛు.

టోటే...: చూడ్డానికి కాస్త పొడవుగా, పెద్దగా ఉండే ఈ రకం బ్యాగుని రెగ్యులర్‌ వేర్‌గా వాడొచ్ఛు అన్నిరకాల దుస్తులమీదకూ ఇది ట్రెండీ లుక్‌ని తెచ్చిపెడుతుంది.

సాచెల్స్‌...: డబుల్‌ హ్యాండిల్‌తో విశాలంగా ఉండే ఈ బ్యాగుల్లో అవసరమైన నివేదికలు, మేకప్‌, లంచ్‌బాక్స్‌ వంటివన్నీ సౌకర్యంగా పెట్టుకోవచ్ఛు అధికబరువుని ఆపగలిగే దీన్ని కూడా రెగ్యులర్‌గా వాడుకోవచ్ఛు

స్లింగ్‌: చిన్న, మధ్యస్థ పరిమాణాల్లో ఉండే ఈ బ్యాగు వేసుకునేవారి లుక్‌నే మార్చేస్తుంది. చేతిలో ఇమిడిపోయే హ్యాండిల్స్‌, భుజాలకు సౌకర్యంగా తగిలించుకునే పొడవాటి స్ట్రాప్స్‌ దీని ప్రత్యేకత. పెట్టుకోవలసిన వస్తువులు పెద్దగా లేనప్పుడు ప్రయాణాలకూ, పార్టీలకూ చక్కగా నప్పుతుంది ఈ రకం.

బ్యాక్‌ప్యాక్‌: కాలేజీ అమ్మాయిలకే కాదు, యువ ఉద్యోగినులకూ ఇవెంతో సౌకర్యం. సౌకర్యంతో పాటు సొగసుగా కనిపించే వీటిల్లో వెనక తగిలించుకునే స్టైల్స్‌తో పాటు హ్యాండ్‌బ్యాగ్‌లా భుజానికి తగిలించుకునే రకాలూ ఉన్నాయి.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని