
తాజా వార్తలు
ఏది భిన్నం?
వాక్యాల్లో జీవులు
ఈ కింది వాక్యాల్లో కొన్ని జీవుల పేర్లు దాగున్నాయి. మరి వాటిని పట్టుకుంటారా?
1. ఈరోజింక పకోడి తిన్నట్లే!
2. అరె నిన్నే రాము.. ఊరుకో! తిన్నగా కూర్చో ముందు
3. ఈ గదిలోనే నేను చదువుకునేది.
4. మా మేనత్త నన్ను కన్న కొడుకులా చూసుకుంటుంది.
5. నాది కాదు పేచీ.. మళ్లీ మళ్లీ చెబుతున్నా.. విను!
క్విజ్.. క్విజ్..
1. ప్రపంచంలో ఎక్కువ మంది తినే పండు ఏది?
2. ఎన్ని నెలల్లో 31 రోజులు ఉంటాయి?
3. మానవ శరీరంలోని ఎముకల సంఖ్య ఎంత?
4. శతాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు?
5. వాతావరణంలో అధికంగా ఉండే వాయువు?
అరె నిజమే కదా!
అన్నదమ్ములిద్దరు మూడు మామిడిపండ్లను కొన్నారు. తాము ఉన్నది ఇద్దరు. పండ్లేమో మూడున్నాయి. అయినా వాటిని సమానంగా ఎలా పంచుకున్నారు?
చెప్పుకోండి చూద్దాం
పోషణలో ఉంది కానీ, దూషణలో లేదు. మడతలో ఉంది కానీ మడమలో లేదు. నడకలో ఉన్నా తడకలో లేదు. ఒక గొప్ప కవిపేరు అది. అదేంటో చెప్పుకోండి చూద్దాం.
దారేది?
పాపం.. బుజ్జి పిల్లికి ఆకలి వేస్తోంది. పాలగిన్నెను చేరుకోవడానికి దానికి దగ్గరి దారి చూపి సాయం చేయరూ!
జవాబులు:
ఏదిభిన్నం: 4
వాక్యాల్లో జీవులు: 1.జింక, కోడి 2.కోతి 3.ఈగ 4.నత్త 5.చీమ
క్విజ్.. క్విజ్..: 1.అరటి 2.ఏడు 3.206 4.100 5.నైట్రోజన్
అరె నిజమే కదా!: మూడు మామిడిపండ్లతో జ్యూస్ చేసుకుని సమానంగా పంచుకున్నారు.
చెప్పుకోండి చూద్దాం: పోతన