close

తాజా వార్తలు

Updated : 30/08/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

త్వరగా అలసిపోతున్నా...

నేను మంచి ఆహారమే తీసుకుంటున్నా. బీపీ, ఘుగర్‌ లేవు. అయినా తరచూ అలసటకు గురవుతున్నా. దీంతో నా పనులు సరిగ్గా పూర్తిచేయలేకపోతున్నా. ఈ నీరసం తగ్గి, ఉత్సాహంగా ఉండటానికి ఆహారంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి.

- దుర్గ, కడప

నం తీసుకునే ఆహారంలో పోషక విలువలున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. లేదంటే శక్తికి మించి పనిచేసినప్పుడు, నిద్రలేమి ఉన్నప్పుడు మనలో అలసట మొదలవుతుంది. అలాగే ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవడం, విరామం లేకుండా పనిచేయడం కూడా నీరసం రావడానికి కారణాలే. ప్రతిరోజూ సమయానికి భోజనం చేయాలనే నియమం పెట్టుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు, క్యాబేజీ, క్యారెట్‌, బీట్‌రూట్‌, వేరుసెనగ, చిలగడదుంపలు, నువ్వులు, సోయాబీన్స్‌ తప్పక ఉండేలా చూసుకోవాలి. అలాగే కమలాపండ్లు, ద్రాక్ష, బొప్పాయి, పాలు, పెరుగుతోపాటూ మాంసాహారులైతే గుడ్లు, మాంసం వంటివాటిని రోజువారీ ఆహారంలో ఉండేట్టు జాగ్రత్త పడాలి. కాఫీ, టీ, శీతలపానీయాలు, రిఫైండ్‌ మైదాతో తయారయ్యే పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్‌ వంటివాటికి దూరంగా ఉండాలి. ఆహారంతోపాటు కంటి నిండా నిద్రపోవాలి. అప్పుడే ఒత్తిడికి దూరంగా ఉండొచ్ఛు దీంతో అలసట కూడా తగ్గుతుంది.

ఇలా చేయాలి: శరీరానికి ఆయుర్వేద ఔషధ తైలాలైన ధన్వంతరి లేదా బలాశ్వగంధ తైలం వంటివి రాసుకుని వేడినీటితో స్నానం చేస్తే అలసట నుంచి బయటపడొచ్ఛు ప్రతిరోజూ రెండు ఉసిరికాయలు తినడం అలవరుచుకోవాలి. లేదా రెండు పెద్ద చెంచాల ఉసిరి రసం తీసుకోవాలి. ఇలా మూడు నుంచి నాలుగు నెలలపాటు చేస్తే శరీరం అలసటకు గురికాదు. అరకప్పు బూడిద గుమ్మడికాయ రసానికి కొంచెం పటికబెల్లం కలిపి తీసుకున్నా నీరసం తగ్గుతుంది. ఎక్కువ బాధ్యతలు నిర్వర్తించడంతో సాధారణంగా మహిళల్లో తరచూ నీరసం కనిపిస్తుంది. ఇటువంటివారు నిరంతరాయంగా పనిచేయకుండా, మధ్యలో కాస్తంత విరామం తీసుకోవాలి.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని