close

తాజా వార్తలు

Published : 31/08/2020 00:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాకర చేదుని ఇలా తగ్గించేద్దాం!

కాకరకాయలో ఎన్నో రకాల ఔషధ గుణాలున్నా... దీనికున్న చేదువల్ల ఎక్కువమంది తినడానికి ఇష్టపడరు. అందుకే చేదుని తగ్గించి వండుకోవడం ఎలానో చూద్దాం...

ఉప్పు, పసుపు: కాకరకాయలను శుభ్రంగా కడిగి పొట్టు తీయాలి. ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి అరగంటపాటు పక్కన పెట్టేయాలి. ఆ తరువాత నీటిని పిండేస్తే చేదు పోతుంది.

పెరుగు: చెక్కు తీసిన కాకరకాయ ముక్కలను పెరుగులో నానబెట్టాలి. ఇలా చేస్తే చేదు తగ్గిపోతుంది.

చక్కెర: కూర దించేముందు కొద్దిగా బెల్లం లేదా చక్కెర వేస్తే చేదు ఉండదు.

ఉల్లిపాయలు, ఆలుతో కలిపి: వీటితో కలిపి వండినప్పుడు అంతగా చేదు అనిపించదు. ఇవనే కాదు మిగతా కూరగాయలు వేయడం వల్ల కూడా చేదు తగ్గుతుంది.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని