
తాజా వార్తలు
కాగితం కప్పుతో గాలిమర!
హాయ్ పిల్లలూ..! మనం హోటల్‌కి వెళ్లినప్పుడో, ఏదైనా ఫంక్షన్లకు హాజరైనప్పుడో పేపర్ కప్పుల్లో నీళ్లు, టీ ఇస్తుంటారు కదా. అలాంటి కప్పులతో ముచ్చటగా ఉండే రకరకాల బొమ్మలు చేసుకోవచ్చు తెలుసా? ఇప్పుడు మాత్రం మనం గాలిమర(విండ్మిల్) ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఇంతకీ గాలిమర అంటే ఏంటో చెప్పలేదు కదూ.. గాలి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే పరికరం అన్నమాట. ఎత్తైన ప్రదేశాల్లో వీటిని అమరుస్తుంటారు.
*● కావాల్సిన వస్తువులు
1. పేపర్ కప్-1
2. మార్కర్ (నలుపు)
3. రంగుల అట్ట (కప్పు రంగు కాకుండా మరోటి ఎంపిక చేసుకోవాలి)
*● ఎలా చేయాలంటే..
ముందుగా పేపర్ గ్లాస్ తీసుకొని తలకిందులుగా చేయాలి. బోర్లించిన ఆ కప్పు కింది భాగంలో కిటికీలు, ద్వారం అనిపించేలా గీతలు గీయాలి. తర్వాత పంకా(ఫ్యాన్) రెక్కల మాదిరి ముందే కత్తిరించిన అట్టముక్కలను ‘x’ ఆకారంలో కప్పు పైభాగంలో అంటించాలి. అంతే.. చూడచక్కని గాలిమర తయారైనట్టే. ఇలా ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకొని అలంకరణ సామగ్రిలా వాడుకోవచ్ఛు ఇంకేం.. మీరు నేర్చుకున్నది స్నేహితులకు, బంధువులకు చూపించండి.
రంగులు వేద్దామా!
మెదడుకు మేత
అది పది అంకెల సంఖ్య. తొలి అంకె ఆ సంఖ్యలోని మొత్తం సున్నాలను, రెండో అంకె ఒకట్లను సూచిస్తుంది. అలా పదవది సంఖ్యలో ఎన్ని తొమ్మిది అంకెలు ఉన్నాయో చెబుతుంది. ఇంతకీ ఆ సంఖ్య ఏదో చెప్పగలరా?
తమాషా ప్రశ్నలు
1. కాళ్లు లేని గుర్రం?
2. తాగలేని ద్రవం?
3. చేతిలోకి తీసుకోలేని కప్పు?
లెక్క తేల్చండి
ఇక్కడి ఆధారాల సాయంతో ప్రశ్నార్థకం స్థానంలో ఏ సంఖ్య ఉండాలో కనుక్కోండి.
జవాబులు: మెదడుకు మేత: 6210001000, లెక్క తేల్చండి: 30 (50+30+10 = 90, 40+20+30 = 90) తమాషా ప్రశ్నలు: 1.సీహార్స్ 2.ఉపద్రవం 3.ఇంటి పైకప్పు
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
