
తాజా వార్తలు
బావిలో చంద్రుడు
అనగనగా ఓ ఊరు. దాని పేరు మాధవపురం. ఈ పల్లెలో రమణయ్య అనే ఓ వ్యక్తి ఉండేవాడు. ఒట్టి అమాయకుడు. ఊర్లో వాళ్లందరూ ఆటపట్టిస్తుండేవారు. అయినా ఇవేమీ మనసులో పెట్టుకోకుండా ఎవ్వరడిగినా తనకు చేతనైన సాయం చేస్తుండేవాడు. కొన్ని రోజులకు అతనికి పెళ్లి జరిగింది. ఆమె అంతకంటే అమాయకురాలు.
ఇద్దరికీ బాగానే జత కుదిరిందని అందరూ మరింతగా నవ్వుకునే వారు. ఇలా కాలం గడుస్తుండగా.. ఓ రోజు రాత్రిపూట రమణయ్య ఊరికే ఇంటి వెనకకు వెళ్లాడు. పౌర్ణమి రోజులు కావడం వల్ల అంతటా వెన్నెలగా ఉంది. హాయిగా చల్లగాలికి అటూ.. ఇటూ తిరిగాడు. ఈ లోపు వాళ్ల భార్య ఓ బిందెడు నీళ్లు వంటగదిలోకి తెమ్మంది. సరే అని బావిలోకి బకెట్ వదులుతూ చూశాడు.
అప్పుడు నీళ్లలో చంద్రుడు కనిపించాడు. అయ్యో.. చంద్రుడు నూతిలో పడిపోయాడు.. అని కంగారు పడిపోయాడు. వెంటనే రమణయ్య తన భార్యను పిలిచాడు.
‘ఆ.. ఏంటండి. బిందెడు నీళ్లు తేవడానికి నానా యాగీ చేస్తున్నారు. ఇవతల వంట చేయాలా వద్ధా.? మీకు చేతకాకపోతే వదిలేయండి. నేనే తెచ్చుకుంటాను..’ అని విసుగ్గా అంది. ‘అది కాదే.. నువ్వు ముందు తొందరగా ఇటు రా..’ అంటూ తెగ కంగారు పెట్టాడు. అయినా ఆమె తీరుబడిగా ఓ పదినిమిషాలు ఆగి వచ్చింది. చూసేసరికి రమణయ్య బావిగట్టుపై తలపట్టుకొని కూర్చొన్నాడు.
‘ఏంటండీ.. మీకిప్పుడు అంత కష్టం ఏమొచ్చింది. ఏదో అనర్థం జరిగినట్లు అలా దీనంగా కూర్చున్నారు. సరే.. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి..’ అని అడిగింది. రమణయ్య లేచి తన భార్యకు బావిలో చంద్రుణ్ని చూపించాడు. చూశావా.. కాంతం.. చంద్రుడు బావిలో పడిపోయాడు.. అన్నాడు. ‘అవునండీ.. ఇప్పుడెలా.. ఊర్లో వాళ్లకు తెలిస్తే పే...ద్ద గొడవై పోతుంది. అయినా ఆ చంద్రుడికి ఈ ఊళ్లో వేరే బావే దొరకలేదా? మన బావిలోనే పడ్డాడు’ అంది ఆమె వెటకారంగా! ‘చంద్రుడు పడలేదే.. నేనే పడేశా’ అని నెమ్మదిగా చెప్పాడు రమణయ్య. ‘అవునా.. ఏంటీ.. మీరనేది?’ అంది అతని భార్య.
‘అవును బంగారం! పాపం చంద్రుడు ముందు బావి గట్టున ఉన్న చిన్న నీళ్ల గుంటలో ఉన్నాడు. నేను బకెట్ బావిలో వేసేటప్పుడు దాంతో పాటు నీళ్లలో పడిపోయాడు. ‘అయ్యో! ఎంత పనిచేశారండి.. వెంటనే మన ఇద్దరం కలిసి చంద్రుణ్ని బయటకు తీద్దాం సరేనా?’ అంది ఆమె. పక్కనే ఉన్న ముళ్లకంపను తాడుతో కట్టి నూతిలోకి వదిలారు. కొంతసేపు బావిలో దాన్ని అటూ ఇటూ తిప్పగా ఓ రాయికి ముళ్లకంప తగిలింది. ఇద్దరూ చంద్రుడు ముళ్లకంపలోకి వచ్చాడు అనుకున్నారు. బలం కొద్దీ తాడును బయటకు లాగారు.
తాడు తెగిపోయి కింద పడ్డారు. పడుతూ.. పడుతూ.. పైకి చూశారు. చంద్రుడు ఆకాశంలో కనిపించాడు. ఇద్దరూ ఆనందంగా అరుస్తూ.. పడితే పడ్డాం కానీ చంద్రుణ్ని నూతిలోంచి బయటకు తీశాం అన్నారు. ఇంతలో రమణయ్య.. ‘ఉండు.. ఉండు.. సరిగా చూడు... చంద్రుణ్ని! పాపం..! మనం వేసిన ముళ్లకంప గుచ్చుకుని అలాగే ఉంది.’ మరి ‘ఇప్పుడు ఎలా?’ అని అడిగింది ఆమె మరింత అమాయకంగా! ‘సరే.. నువ్వొక పని చెయ్యి.. మన ఇంట్లో ఉన్న నిచ్చెన తీసుకురా..! ఇద్దరమూ వెళ్లి చంద్రుడికి గుచ్చుకుని ఉన్న ముళ్లకంప తీద్దాం’ అన్నాడు.
ఆమె వెనకాముందు ఆలోచించకుండా ఇంట్లోకి వెళ్లింది. అంతలోనే రమణయ్య వాళ్ల అమ్మ వచ్చి విషయం తెలుసుకొని.. ముందు నవ్వుకుని.. తర్వాత ఇద్దరికీ అసలు విషయం చెప్పి చీవాట్లు పెట్టి ఇంట్లోకి తీసుకెళ్లింది.
-ఎస్.లక్ష్మీనాగమణి, చాగల్లు, పశ్చిమగోదావరి జిల్లా
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- తాగడానికి తగని సమయముంటదా..!
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
