close

తాజా వార్తలు

Published : 15/09/2020 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుండెకు అరటి మేలు

గుండె ఆరోగ్యానికి.. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణకు పొటాషియం అత్యావశ్యకం. ఇంత కీలకమైనదైనా చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఆహారం ద్వారా దీన్ని పొందటం పెద్ద కష్టమేమీ కాదు. అరటిపండ్ల మీద దృష్టి పెడితే చాలు. మామూలు సైజు అరటిపండు ఒకటి తిన్నా రోజుకు అవసరమైన పొటాషియంలో 9% లభించినట్టే. అందుకే అరటిపండ్లు ఎక్కువగా తినేవారికి గుండెజబ్బు ముప్పు 27% తక్కువని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అరటి పండ్లలో పొటాషియం ఒక్కటే కాదు, గుండె ఆరోగ్యానికి మేలు చేసే మెగ్నీషియం కూడా ఉంటుంది. డొపమైన్‌, క్యాటెచిన్స్‌ వంటి యాంటీఆక్సిడెంట్లూ దండిగా ఉంటాయి. విశృంఖల కణాల అనర్థాలను తగ్గించే ఇవీ గుండె ఆరోగ్యానికి తోడ్పడేవే. డొపమైన్‌ అనగానే హుషారును కలిగించే రసాయనంగానే గుర్తుకొస్తుంది. కానీ అరటిలోని డొపమైన్‌ యాంటీఆక్సిడెంట్‌గానూ పనిచేస్తుంది.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని