close

తాజా వార్తలు

Published : 17/09/2020 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాటా అడిగితే ఇంట్లో ఉండొద్దంటున్నారు!

మాది క్రైస్తవ మైనారిటీ కుటుంబం. మా తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసి ప్రభుత్వ పింఛను పొందుతూ మరణించారు. నేను అవివాహితను. కుటుంబ సభ్యులందరి ఆమోదంతో నేను జీవితకాల ప్రభుత్వ పింఛను అనుభవిస్తున్నాను. మా నాన్నగారి పేరు మీద కొంత పొలం, ఇల్లూ ఉన్నాయి. ఆయన వీలునామా రాయకుండా చనిపోయారు. మా అన్నదమ్ములు ఇంట్లో ఉండవచ్చు కానీ పొలంలో వాటా మాత్రం అడగొద్దంటున్నారు. ఆ ఆస్తిలో నాకు హక్కు ఉంటుందా? - ఓ సోదరి

మీ సమస్య భారత వారసత్వ చట్టం- 1925 పరిధిలోకి వస్తుంది. ఇది స్వాతంత్య్రానికి ముందు వచ్చింది కాబట్టి దీనిలోని కొన్ని సెక్షన్లు బ్రిటీష్‌ క్రిస్టియన్స్‌కీ, మరికొన్ని సెక్షన్లు భారతీయ క్రైస్తవులకీ విడివిడిగా చెప్పారు. సెక్షన్‌ 5 ప్రకారం ఓ వ్యక్తి ఆస్తుల పంపకం అతని చిరునామా(డొమెసైల్‌)ను బట్టి నిర్ణయమవుతుంది. భారత క్రైస్తవ కుటుంబానికి చెందిన పురుషుడు చనిపోతే...అప్పటికి... ఆ వ్యక్తి భార్య కూడా మరణిస్తే ఆ ఆస్తి పిల్లందరికీ సమానంగా వస్తుంది. దాన్ని బట్టి మీకూ మీ తండ్రి ఆస్తిలో వాటా సమానంగా లభిస్తుంది. మీ కుటుంబసభ్యులంతా కలిసి మీకు పింఛను వచ్చేలా చేశారంటున్నారు. అప్పుడు అందుకు ఏదైనా అగ్రిమెంట్‌ రాయించుకున్నారా? కేవలం నామమాత్రపు ఆమోదమే అయితే మీరు వాటా కోరుతూ భాగస్వామ్య దావా వేయొచ్ఛు ఒకవేళ మీరు ఆస్తిలో వాటా వద్దనుకున్నా సరే! వారు మిమ్మల్ని జీవితకాలం ఇంట్లో ఉండనిస్తామని హామీ ఇస్తూ ఏదైనా పత్రం రాయించుకుంటే మేలు.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని