
తాజా వార్తలు
వ్యక్తిగత రుణం.. ఎప్పుడంటే..
ఎలాంటి హామీ, తనఖాలు లేకుండా సులభంగా తీసుకునేందుకు వీలున్నది వ్యక్తిగత రుణం.. ఇటీవల దీనికి గిరాకీ పెరిగింది. కరోనా నేపథ్యంలో ఆదాయాలు తగ్గడంతో.. చాలామంది వీటిని తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. వస్తువుల కొనుగోలు, ఇంటి మరమ్మతులు, పిల్లల ఫీజులు, వాహనం కొనుగోలు, ఆరోగ్య అత్యవసరం ఇలా చాలా సందర్భాల్లో వ్యక్తిగత రుణం తీసుకునే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. అయితే, ఏయే సందర్భాల్లో ఈ అప్పు తీసుకోవాలనే విషయంలో కాస్త స్పష్టత ఉండాలి.
* ఒకటికి మించి అప్పులుండి, క్రెడిట్ కార్డుల బిల్లులు పేరుకుపోయాయనుకోండి.. అప్పుడు వాటన్నింటినీ ఒక చోటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించవచ్చు. దీనికోసం వ్యక్తిగత రుణాన్ని ఉపయోగించుకోవచ్చు. అనేక అప్పులుంటే వాటిని నిర్వహించడం కష్టం. దానికి బదులుగా ఒకే అప్పు ఉంటే.. దానిని సులభంగా నిర్వహించవచ్చు. క్రెడిట్ కార్డు అప్పులకు బదులు దానికన్నా తక్కువ వడ్డీ ఉండే వ్యక్తిగత రుణమే మేలు.
* సొంతిల్లు ఉన్నప్పుడు దానికి మరమ్మతులు సహజం. కొన్నిసార్లు దీనికి పెద్ద మొత్తంలోనే డబ్బు అవసరం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లోనూ వ్యక్తిగత రుణం ఆదుకుంటుంది.
* ప్రస్తుత కరోనా సమయంలో ఎవరికి ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు చేతిలో డబ్బులు ఉంటే ఇబ్బంది లేదు. ఆరోగ్య బీమా ఉన్నవారికీ ఆ మొత్తం సరిపోనప్పుడు.. డబ్బు కావాలంటే ఉన్న మార్గం ఈ రుణమే. ఆరోగ్య అత్యవసరం ఉన్నప్పుడు చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వేగంగా రుణ దరఖాస్తును పరిష్కరిస్తున్నాయి.
* బదిలీ లేదా వేరే ఇతర కారణంతో ఒక ప్రాంత నుంచి మరో చోటకు వెళ్లాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు చేతిలో కొన్ని డబ్బులు అవసరం. ఇలాంటప్పుడూ సులువుగా దొరికే వ్యక్తిగత రుణం తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు.
* వివాహం సమయంలో అధిక మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. అనుకోని ఖర్చులూ ఉంటాయి. ఇలాంటి ముఖ్యమైన అవసరాల నిమిత్తం వ్యక్తిగత రుణాన్ని ఎంచుకోవచ్చు.
* పిల్లల ఉన్నత చదువులకు విద్యా రుణం తీసుకునే వీలున్నా.. కొన్నిసార్లు అనుకున్న మొత్తం రాకపోవచ్చు. నిబంధనలూ ఎక్కువగానే ఉంటాయి. ఆన్లైన్ కోర్సుల్లో చేరేందుకు అవసరమైన ఫీజులకు వ్యక్తిగత రుణమే ఉపకరించవచ్చు.
* కొంతమందికి క్రెడిట్ స్కోరు ఉండదు.
ఇలాంటప్పుడు క్రెడిట్ స్కోరును పెంచుకోవడానికి వ్యక్తిగత రుణం తీసుకొని, దానికి క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించండి. అప్పుడు మీ రుణ చరిత్ర మెరుగుపడటంతోపాటు, స్కోరు పెరుగుతుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- స్వాగతం అదిరేలా..
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- డీఎం సాబ్.. నేను తేజస్వి మాట్లాడుతున్నా..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
